కలెక్షన్ బాగా వచ్చే సీజన్: మహేష్ బాబు, బన్నీ అస్సలు తగ్గడం లేదు

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య బాక్సాఫీసు ఫైట్ జరుగబోతోంది.

By Bojja Kumar

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలు పోటాపోటీగా ఒకే రోజు విడుదలకు సిద్ధం కావడం చర్చనీయాంశం అయింది. సినిమాలకు కలెక్షన్ బాగా కురిపించే సమ్మర్ సీజన్ కావడంతో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.

ఈ ఇద్దరి సినిమాలు ఏప్రిల్ 27, 2018లో విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 90 శాతంపైగా థియేటర్లలో వీరిద్దరి సినిమాలే ఉంటాయని టాక్. అయితే ఎవరి సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.

భరత్ అను నేను

భరత్ అను నేను

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న (భరత్ అను నేను) వాస్తవానికి ఈ చిత్రాన్ని ముందు సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాక పోవడంతో సినిమా రిలీజ్ డేట్ మారింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కైరా అద్వాని హీరోయిన‌గా నటిస్తున్నారు.

షూటింగ్ ప్రొగ్రెస్

షూటింగ్ ప్రొగ్రెస్

నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ ''నవంబర్‌ 7 వరకు హైదరాబాద్‌ షెడ్యూల్‌ జరుగుతుంది. నవంబర్‌ 22 నుంచి ఔట్‌ డోర్‌ షెడ్యూల్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో మా బేనర్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. మహేష్‌ కెరీర్‌లో ఇది మరో పవర్‌ఫుల్‌ మూవీ. అలాగే మా బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 27న సమ్మర్‌ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

నా పేరు సూర్య

నా పేరు సూర్య

మరో వైపు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య' కూడా ఏప్రిల్ 27, 2018లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ లగడపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 సైనికుడి పాత్రలో బన్నీ

సైనికుడి పాత్రలో బన్నీ

‘నా పేరు సూర్య' సినిమా దేశభక్తికి సంబంధించిన కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమా క్యాప్షన్ ‘నా ఇల్లు ఇండియా' అని పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X