మహేష్ బాబు కూడా యాంక్సైటీగా ఉన్నాడట...!
'అతడు అంతర్ముఖుడు. నిండు గాంభీర్యంగా కనిపించే నెమ్మదస్తుడు. ఏదైనా అనుకొని మైండ్ లో ఫిక్స్ అయితే చాలు ఒక్కడై ఇక ఆ పని పూర్తి అయ్యే వరకూ నిద్ర పోడు' ఇది మహేష్ అభిమానులకు మహేష్ పై ఉన్న అభిప్రాయం. ఇటీవల విడుదలైన అతిధి, ఖలేజా సినిమాలు మహేష్ అభిమానుల అంచనాలని అందుకోలేకపోయాయి.వారెప్పుడూ పోకిరి అంచనాలతోనే థియేటర్లకు వస్తున్నారు.ఈ నేపధ్యంలో మహేష్ మరోసారి పోకిరి ఫార్ములానే నమ్ముకొనాడు. అదే ఆ సినిమా పేరే 'దూకుడు'
మహేష్ బాబు కథానాయకుడుగా, సమంత కథానాయకిగా శ్రీనూవైట్ల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'దూకుడు' రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాతలు ఈ చిత్రం చిత్రీకరణ ముగింపు దశలో వుంది. 'దూకుడు" చిత్ర పాటలని ఈనెల 18 న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా పాటల విడుదల తేదీని మహేష్ తన ట్విట్టర్ లో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసుకొంటూ 'మీలాగే నేను కూడా ఆ రోజు కోసంగా ఎంతగానో ఎదురు చూస్తున్నాను" అని రాసుకొన్నారు.


Click it and Unblock the Notifications











