గొల్లపూడి మరణం : ఓ రత్నాన్ని కోల్పోయాం.. ఎప్పటికీ మరువలేము..
ప్రముఖ నటుడు, రచయిత, కాలమిస్ట్ గొల్లపూడి మారుతి రావు మరణంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంత కాలంనుంచి అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి.. నేడు తుది శ్వాస విడిచారు. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. కాసేపటి క్రితమే మరణించారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
ఓ రత్నాన్ని కోల్పోయాం..
గొల్లపూడి మరణ వార్తను విన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. తెలుగు చిత్ర సీమకు ఆయన అందించిన సేవలు మరవలేమన్నాడు. ఓ రత్నాన్ని కోల్పోయామని అన్నాడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు.
ఎప్పటికీ మరువలేము..
గొల్లపూడి మరణంపై ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందించాడు. ‘ఆయన రచన.... ఆయన నటన.... ఎప్పటికీ మరువలేము..... గొల్లపూడి మారుతి రావు గారి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను'అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.
తీరని లోటు..
‘తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు.. రచయిత నుంచి నటన వరకు అన్ని రకాల పాత్రలను పోషించిన నాకు ఇష్టమైన నటుడు.. మిమ్మల్ని మేమంతా మిస్ అవుతున్నాం' అంటూ అల్లరి నరేష్ ట్వీట్ చేశాడు.
గొప్ప ఉదాహరణ..
‘గొల్లపూడి మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను.. గొప్ప నటుడికి మంచి ఉదాహరణ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాల'ని సుధీర్ బాబు ట్వీట్ చేశాడు.
ఎప్పటికీ గుర్తుండేపోయే వారు..
‘గొల్లపూడి మారుతి రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. అందరికీ ఇష్టమైన నటుడు, ఎప్పటికీ గుర్తుండిపోయే వారు' అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ పేర్కొంది.


Click it and Unblock the Notifications











