21 ఏళ్ల ‘రాజ కుమారుడు’.. దర్శకేంద్రుడు, మహేష్ బాబు ఎమోషనల్
హీరోలను స్టార్‌గా మార్చాలన్నా.. ఆ స్టార్‌కు ఓ ఇమేజ్ కట్టబెట్టాలన్నా, హీరో స్థాయిని పదింతలు పెంచాలన్నా అది కేవలం దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుకే చెల్లుతుంది. అందుకు అప్పట్లో స్టార్స్ తమ వారసులను దర్శకేంద్రుడి చేతిలో పెట్టేవారు. అప్పటి వరకు బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో అదరగొట్టిన మహేష్ బాబును మొదటగా పూర్తి స్థాయి హీరోగా నిలబెట్టేందుకు రాఘవేంద్రరావు పూనుకున్నాడు. మహేష్ బాబును 'రాజకుమారుడు'గా చేశాడు.
వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకేంద్రుడి సారథ్యంలో మహేష్ బాబు రాజ కుమారుడు చిత్రంతో హీరోగా వచ్చాడు. నేటికి ఈ చిత్రం విడుదలై సరిగ్గా 21 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా మహేష్‌బాబు ట్విటర్‌లో నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. తనకు తొలి చిత్రం రాజకుమారుడు హిట్ ఇచ్చినందుకు రాఘవేంద్రరావు, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సినిమా అనుభవంతో నటనలో తనెంతో నేర్చుకున్నట్లు, అది ఎప్పటికీ తన మదిలోనే ఉంటాయని వెల్లడించాడు. రాఘవేంద్ర రావు, చిత్ర యూనిట్‌తో కలిసిన పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఓ వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేశాడు.
ఇక ఈ సినిమాపై దర్శకేంద్రుడు చేసిన ట్వీట్ కూడా తెగ వైరల్ అవుతోంది. 'రాజకుమారుడు కి 21 వసంతాలు... ఎన్నో మధుర జ్ఞాపకాలు... మా అశ్వినీదత్ కి మరియు చిత్రబృందానికి శుభాకాంక్షలు. మా మహేష్ బాబు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను...' అంటూ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











