మహేష్, నమ్రత పెళ్లికి 15 ఏళ్లు.. సూపర్‌స్టార్ ప్రేమ ఎలా.. ఎక్కడ మొదలైందో తెలుసా?
టాలీవుడ్‌లో స్టార్ దంపతులు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు, ఒకప్పటి అందాల తార నమ్రతా శిరోద్కర్. వంశీ చిత్ర షూటింగ్‌లో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఏడడుగులు నడిచేలా చేసింది. ఆ తర్వాత వారిద్దరూ సంపూర్ణ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుండటం తెలిసిందే. మహేష్, నమ్రత దంపతుల జీవితంలోకి ఓసారి తొంగి చూస్తే...

వంశీ చిత్ర షూటింగ్‌లో పీకల్లోతు
ప్రిన్స్ మహేష్, నమ్రత ఇద్దరూ వంశీ చిత్రం నుంచి పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. దాదాపు వారి ప్రేమ 4 సంవత్సరాలుపాటు సాగింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వారిద్దరు 2005లో ఫిబ్రవరి 10న వివాహం చేసుకొన్నారు. ప్రస్తుతం వారిద్దరి దాంపత్య జీవితానికి సుమారు 15 ఏళ్లు నిండటం విశేషం. గత దశాబ్దానికి పైగా జీవితంలో గౌతమ్, సితారా అనే ఇద్దరు సంతానం ఉన్నారు.
పెళ్లి తర్వాత నమ్రత నటనకు దూరం
మహేష్‌తో పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా నటనకు స్వస్తి చెప్పారు. మహేష్‌ను కంటికి రెప్పలా చూసుకొంటూ ఆయన కెరీర్‌ను చక్కదిద్దే పనిలో మునిగిపోయారు. మహేష్ యాడ్స్ ఎండార్స్‌మెంట్స్‌ను చూసే బాధ్యతను ఎత్తుకొన్నారు. అలాగే బిజినెస్ వ్యవహారాలను పక్కాగా చూసుకుంటూ మహేష్ కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే పనిలో పడ్డారు.

1993లో మిస్ ఇండియాగా
నమ్రత శిరోద్కర్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1993లో మిస్ ఇండియా బ్యూటీ టైటిల్‌ను గెలుచుకొన్నారు. ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అంజి చిత్రంలో చిరంజీవి సరసన నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన చివరి చిత్రం బ్రైడ్ అండ్ ప్రిజ్యుడిస్ 2004లో రిలీజ్ అయింది.
Recommended Video

వరుస విజయాలతో మహేష్ బాబు
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. వరుస విజయాలతో టాలీవుడ్‌లో ముందుకెళ్తున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో సరికొత్త కలెక్షన్ల రికార్డులను సొంతం చేసుకొన్నాడు. తాజాగా ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.220 కోట్లతో మహేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది.


Click it and Unblock the Notifications











