twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిత్రపరిశ్రమకు రాయితీలు.. స్పందించిన మహేష్, పూరీ, రాజమౌళి

    |

    టాలీవుడ్‌పై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింన సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలో చిత్ర పరిశ్రమను ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రాయితీల పట్ల సినీ సెలెబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌కు రాయితీలు ఇవ్వడంపై చిరంజీవి, నాగార్జున ఇతర హీరోలందరూ నిన్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు రాజమౌళి, మహేష్ బాబు, పూరి జగన్నాథ్ వంటివారు స్పందించారు.

    కేసీఆర్ ప్రకటన చిత్ర పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొస్తుందని, తప్పకుండా పరిశ్రమలో మంచి పురోగతి కనిపిస్తుందని రాజమౌళి ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు పరిశ్రమకు ఎంతో మేలు చేకూర్చేలా ఉన్నాయి.. వెండితెరపై ఆధారపడిన లక్షలాది కార్మికులకు కేసీఆర్ చేయూతనిచ్చారు.. కొవిడ్ పరిస్థితుల్లోనూ పరిశ్రమపై దృష్టి సారించిన కేసీఆర్, కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలని మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

     Mahesh Babu And Rajamouli Praies KCR Gesture For Tollywood

    కష్టకాలంలో పరిశ్రమకు అవసరమైన నిర్ణయాలను ప్రకటించి, ఆదుకోవడం పట్ల కేసీఆర్‌కు పూరి జగన్నాథ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. థియేటర్లని ఎప్పుడైనా తెరుచుకోవచ్చని ఆదేశాలు ఇవ్వడంతో పాటు.. రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌, థియేటర్లకి కనీస విద్యుత్‌ ఛార్జీల రద్దు, ప్రదర్శనల సంఖ్య పెంచుకోవడం, టికెట్‌ ధరల్లో సవరణలు చేసుకునే వెసులుబాటుపై కేసీఆర్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Mahesh Babu And Rajamouli Praies KCR Gesture For Tollywood, A huge leap for TFI!! Thanking our government for all the relief measures being announced to keep alive the tradition of watching films on the big screen and sustaining lives of millions working in the industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X