twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఉప్పెన’పై ప్రశంసల వెల్లువ.. రష్మిక అలా.. మహేష్ బాబు ఇలా!

    |

    ప్రస్తుతం ఉప్పెన జోరు ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప్పెన హవా ఓ రేంజ్‌లో ఉంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టేసి లాభాలబాట పట్టేసింది. డెబ్యూ హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లకు ఇలాంటి హిట్ రావడం మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. తాజాగా నిర్మాతలు కూడా ఉప్పెన కలెక్షన్లపై అధికారిక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఉప్పెనపై సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు.

    ఉప్పెనపై అలా..

    ఉప్పెనపై అలా..

    ఉప్పెన సినిమాపై కాస్త డివైడ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. మొదటి ఆటకు వచ్చిన నెగెటివ్ టాక్ కాస్తా.. చివరి ఆటకు మారిపోయింది. హౌస్ ఫుల్ బోర్డులతో ఉప్పెన లాంటి కాసుల వర్షం కురిసింది. బాక్సాఫీస్ వద్ద 'ఉప్పెన'లా విరుచుకుపడుతోంది ఈ సినిమా.

    కలెక్షన్ల రచ్చ..

    కలెక్షన్ల రచ్చ..

    ఉప్పెన సినిమాకు మొదటి వారాంతంలోనే లాభాలు వచ్చేశాయి. మూడు రోజుల్లోనే 32 కోట్ల షేర్, 50 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టేసింది. ఇప్పుడు ఉప్పెన సినిమా గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ జరుగుతోంది. కరోనా సమయంలోనూ ఇలాంటి వసూళ్లు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు.

    మహేష్ బాబు ఇలా..

    మహేష్ బాబు ఇలా..

    ఉప్పెన సక్సెస్ అయిందని వింటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది..కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టిలకు కంగ్రాట్స్.. సినిమా చూడాలని ఎంతో ఆత్రుతగా ఉందంటూ విజయ్ సేతుపతి, మైత్రీ, సుకుమార్ రైటింగ్స్, బుచ్చిబాబు సనలకు కంగ్రాట్స్ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు.

    రష్మిక అలా..

    రష్మిక అలా..

    ఉప్పెన.. నేను ఈ సినిమా గురించి ఎంతో వింటున్నాను.. త్వరలోనే కచ్చితంగా చూస్తాను.. మొదటి సినిమాతోనే దర్శకుడు బుచ్చిబాబు సన, నటీనటులు వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టిలు ఎంతో మంచి పేరు వస్తోంది..విజయ్ సేతుపతి సర్ గురించి ఇంకేం చెప్పగలను.. ప్రతీసారి అంతే నువ్ కుమ్మేస్తావ్ దేవీ శ్రీ ప్రసాద్.. నువ్ చేసే పనిలో బెస్ట్ ఇస్తుంటావ్.. సుకుమార్ రైటింగ్స్, సుకుమార్, మైత్రీ మీరెప్పుడూ అద్భుతమైన పనితనంతో నన్ను (అభిమానిని) నిరాశపర్చరు.. అంటూ రష్మిక ప్రశంసలు కురిపించింది.

    English summary
    Mahesh babu And Rashmika Mandanna About Uppena.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X