మహేష్ బాబు,నమ్రతల ముద్దుబిడ్డ గౌతమ్ కూడా నటడయ్యాడని సమాచారం.ధమ్స్ అప్ యాడ్ లో మహేష్ తన కొడుకు తో కలసి నటించాడని ...అది ఈ మధ్యనే షూటింగ్ జరిపారని చెప్తున్నారు. త్వరలో టీవి స్క్రీన్స్ పై రాబోయే ఈ యాడ్స్ లో మహేష్ చాలా క్యూట్ గా కనిపించటమే కాక కొద్దిగా యాక్షన్ కూడా మిక్స్ చేసారని చెప్తున్నారు. అలాగే 2008లో వెండితెరపై కనపడని మహేష్ తన తర్వాత వెంచర్ త్రివిక్రమ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అయితే అది సెట్స్ తయారి లేటుతో మరింత పోస్ట్ ఫోన్ అవుతోంది.ఇక ఈ సారి కనిపించే చిత్రంలో మహేష్ ఓ ఆటో డ్రైవర్ పాత్రలో కనపడతాడని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హీరోయిన్ పాత్ర మిస్ ఇండియా అని చెప్తున్నారు. ఇక మహేష్ కొడుకు కూడా ప్రేక్షకులకు నచ్చితే ఏ సిసింద్రీలాంటి చిత్రానికి ప్లాన్ చేస్తారని కొందరంటున్నారు.