‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్: మహేష్ స్పీచ్ అదుర్స్.. వెంకీ ఫన్నీగా!

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది.

మే 9న ప్రపంచవ్యాప్తంగా 'మహర్షి' చిత్రం విడుదలువుతున్న నేపథ్యంలో బుధవారం(మే 1) నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ప్రసంగం ఆకట్టుకుంది.

తెలుగులో ఏ హీరో కూడా ఆయనంత ఇష్టం లేదు

తెలుగులో ఏ హీరో కూడా ఆయనంత ఇష్టం లేదు

మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘ముందుగా మా అన్నయ్య వెంకటేష్ గారికి థాంక్స్ చెప్పాలి. ఆయనంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో ఏ హీరో కూడా అంత ఇష్టం లేదు. ఆయన ఎనర్జీ చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఆయన ఏ సెట్టుకు వెళ్లినా, ఏ ఫంక్షన్ వెళ్లినా సినిమా సూపర్ హిట్ అని అంటుంటారు. వెంకటేష్ గారు పిలవగానే వచ్చినందుకు థాంక్స్.

నీ లైఫ్ చాలా బావుందమ్మా. ఆల్ ది బెస్ట్: విజయ్ దేవరకొండ గురించి మహేష్ బాబు

నీ లైఫ్ చాలా బావుందమ్మా. ఆల్ ది బెస్ట్: విజయ్ దేవరకొండ గురించి మహేష్ బాబు

‘‘ఈ యంగ్ జనరేషన్ యాక్టర్లో నేను అడ్మైర్ చేసేది యాక్టర్ విజయ్. అర్జున్ రెడ్డి సినిమాకు అతడి పని తీరు నచ్చింది. ఒకసారి నా షూటింగ్ సమయంలో సెట్టుకు వచ్చి కలిశాడు. ఇద్దరం కలిసి చాలా సమయం మాట్లాడుకున్నాం. శ్రీమంతుడు అవార్డ్ తీసుకున్నపుడు నన్ను చూశాడట. నేను చూడలేదు. లైఫ్ అంటే అలా ఉండాలని అన్నాడు... కానీ ఇపుడు నీ లైఫ్ చాలా బావుందమ్మా. ఆల్ ది బెస్ట్'' అంటూ మహేష్ బాబు చమత్కరించారు.

ఈ 25 సినిమాల జర్నీలో నేను థాంక్స్ చెప్పుకోవాల్సిన డైరెక్టర్లు

ఈ 25 సినిమాల జర్నీలో నేను థాంక్స్ చెప్పుకోవాల్సిన డైరెక్టర్లు

ఈ 25 సినిమాల జర్నీలో నేను థాంక్స్ చెప్పుకోవాల్సిన డైరెక్టర్లు కొంత మంది ఉన్నారు. ముందుగా నన్ను పరిచయం చేసిన రాఘవేంద్రరావుగారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను యాక్టింగ్ చేయగలను అని రుజువు చేసిన సినిమా కృష్ణ వంశీగారి మురారి. నన్ను స్టార్ చేసిన సినిమా గుణశేఖర్ గారి ‘ఒక్కడు'.. నన్ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసిన సినిమా త్రివిక్రమ్ గారి ‘అతడు'.. నా లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ శ్రీను వైట్ల గారి ‘దూకుడు'. కొరటాల శివగారు శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల ద్వారా రెండు సార్లు లైఫ్ ఇచ్చారని మహేష్ బాబు గుర్తు చేసుకున్నారు.

నా కోసం రెండేళ్లు వెయిట్ చేశాడు

నా కోసం రెండేళ్లు వెయిట్ చేశాడు

25వ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి. నేను ఏ దర్శకుడినీ పేరు పెట్టి పిలవను. అలా పేరు పెట్టి పిలిచిన ఫస్ట్ డైరెక్టర్ వంశీ. అతడిని నా తమ్ముడిలా ఫీలయ్యాను. ఈ సినిమా కథ విన్నపుడు ఓ 10 నిమిషాలు విని పంపించేద్దామనుకున్నాను. ఎందుకంటే అప్పటికే రెండు మూడు సినిమాల కమిట్మెంట్స్ ఉన్నాయి. కానీ వంశీ నేరేషన్ 20 నిమిషాలు వినగానే... నాకు రెండు సినిమాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాల తర్వాతే చేయాల్సి వస్తుందేమో అన్నాను. నో ప్రాబ్లం సర్... రెండేళ్లయినా వెయిట్ చేస్తాను, మీరు తప్ప ఈ కథలో ఎవరినీ ఊహించలేను అన్నాడు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా డైరెక్టర్ వద్ద కథ ఉంటే రెండు నెలలు లేట్ అయినా వేరే హీరోల దగ్గరకు వెళ్లిపోతారు. అలా కాకుండా రెండేళ్లు వెయిట్ చేశాడు.

టెక్నీషియన్ల గురించి

టెక్నీషియన్ల గురించి

అల్లరి నరేష్ గారు ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు థాంక్స్ చెప్పాలి. పూజా మేజింగ్ కో స్టార్. మోహనన్ సర్ డిఓపీ, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటాయి. రాజు సుందరం సర్ డాన్స్ కొరియోగ్రఫీలో చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువగా ఆయన్నే ప్రిఫర్ చేస్తాను. నా 25వ సినిమాలో ఆయనే సోలో కార్డ్ కావడం ఆనందంగా ఉందని మహేష్ బాబు తెలిపారు.

వెంకటేష్ ఫన్నీ స్పీచ్‌

వెంకటేష్ ఫన్నీ స్పీచ్‌

ఈ సందర్భంగా వెంకటేష్ తన ఫన్నీ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ‘ప్రపంచాన్నే ఏలేస్తాడు మా మహేష్ బాబు... ట్రైలర్ చూశారుగా, అదిరిపోయిందిగా' అంటూ వెంకీ తన ప్రసంగం మొదలు పెట్టారు. 25వ సినిమా అయినా మహేష్ బాబు ఇంకా 25 ఏళ్ల కుర్రాడిలా ఉన్నాడు. ప్రతి ఆర్టిస్టుకు కెమెరా ఫేవర్ యాంగిల్ ఉంటుంది. కానీ మహేష్ బాబుకు 360 డిగ్రీస్ కెమెరా ఎక్కడ పెట్టినా చాలా సూపర్‌గా కనిపిస్తాడు. అందుకే మేడమ్ టుస్సాడ్స్‌లో తన స్టాచ్యూ కూడా పెట్టేశారు. ఈ సినిమా మహేష్ బాబు, మొత్తం యూనిట్‌కు ప్రెస్టీజియ్ ప్రాజెక్ట్. మే 9న సినిమా వస్తోంది. ఒకప్పుడు చిన్నాడు నా మీద కోపంగా పూల కుండీ తన్నాడు. అపుడు తన్నినపుడు ఆ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో మీ అందరికీ తెలుసు. మళ్లీ ఈ సినిమాతో అన్ని రికార్డులు తన్నేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X