twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దూకుడు' చేసేటప్పుడు తెలిసింది మొదటిసారి : మహేష్ బాబు

    By Srikanya
    |

    హైదరాబాద్ :మ‌హేష్ బాబు సినిమా రంగంలో చాలా ప్ర‌ముఖ‌మైన సెల‌బ్రెటీ. గ‌తంలో టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ స‌ర్వేలో ఆయ‌న బాలీవుడ్ సెల‌బ్రిటీల స‌ర‌స‌న నిలిచారు. మ‌న‌సు దోచుకునే ఆయ‌న అందం మ‌రియు వ్య‌క్తిత్వం ఆధునాత‌న సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి ద‌క్షిణాసియా వీడియోల‌ను ప్రపంచానికి అందిస్తోన్న య‌ప్ టీవీతో మ‌రింత ఇనుమ‌డిస్తాయి అని చెప్పుతున్నారు.

    ఇప్పటికే మహేష్ ఖాతాలో థమ్సప్, పారగాన్ , రాయల్ స్టాగ్ , వివెల్ షాంపూ,సంతూర్, జొస్ అలూక్కాస్, ఐడియా ..బ్రాండ్లు వున్న సంగతి తెలిసిందే.
    ఇప్పుడు యప్ టీవి లో కూడా ఆయన బ్రాండ్ వేసుకుంది.

    ద‌క్షిణాసియా కంటెంట్ ను క‌లిగిన ప్ర‌పంచ‌పు అతి పెద్ద ఆన్ లైన్ స్ట్రీమింగ్ వేదిక అయిన‌టువంటి య‌ప్ టీవీ టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప్ర‌క‌టించింది.

    ఓ టీటీ (ఓవ‌ర్ ది టాప్) స్పేస్ లో ప్ర‌పంచ దిగ్గ‌జ‌మైన య‌ప్ టీవీ 12కు పైగా ప్రాంతీయ భాష‌ల్లో ద‌క్షిణాసియా కంటెంట్ ను అందిస్తుంది. ఈ తాజా ప్ర‌క‌ట‌న‌తో య‌ప్ టీవీ ఆయ ప్రాంతాల్లో త‌న ఆద‌ర‌ణ ఏ స్ధాయిలో పెరుగుతుందో నిరూపించేందుకు మొద‌టి అడుగు.

    అప్పట్లో దూకుడు చేసేటప్పుడు తెలిసింది

    అప్పట్లో దూకుడు చేసేటప్పుడు తెలిసింది

    ఆరు సంవ‌త్స‌రాల క్రితం దూకుడు సినిమా షూటింగ్ టైమ్ లో విదేశాల్లో ఉన్న‌ప్పుడు ఓ నిర్మాత త‌న ఫోన్ లో న్యూస్ ఛాన‌ల్ చూస్తున్నాడు. ఫోన్ లో న్యూస్ ఛాన‌ల్ ఎలా చూడ‌గ‌లుగుతున్నారు అని నేను అడిగితే య‌ప్ టీవీ ద్వారా అని చెప్పాడు. అప్పుడు అద్భుతం అనిపించింది. ఇప్పుడు నేను అద్భుతం అనిపించిన య‌ప్ టీవీతో అసోసియేట్ అవ్వ‌డం చాలా సంతోషంగా, గ‌ర్వంగా ఉంది అన్నారు.

    టీటీ స్పేస్ లో మార్గదర్శి

    టీటీ స్పేస్ లో మార్గదర్శి

    మ‌హేష్ బాబు మాట్లాడుతూ...ద‌క్షిణాసియా కంటెంట్ ను అందించేటువంటి య‌ప్ టీవీ ఓ టీటీ స్పేస్ లో మార్గ‌ద‌ర్శిగా నిలిచింది. ఎప్పుడైనా ద‌క్షిణాసియా కంటెంట్ వీడియోల‌ను ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి చూడాల‌నుకునే వారికి య‌ప్ టీవీ వాటిని చేరువ చేసింది అన్నారు.

    స్టీమింగ్ రంగంలోనే

    స్టీమింగ్ రంగంలోనే

    యప్ టీవిలో వీడియోలని చూస్తూ వీక్ష‌కులు త‌మ ఇళ్లు లేదా ప్రాంతంలో ఉన్న‌ట్లు అనుభూతి పొందుతారు. ఎంట‌ర్ టైన్ మెంట్ లో నా మొద‌టి ఛాయిస్ య‌ప్ టీవీ. నాక తెలిసి వినోదం యొక్క భ‌విష్య‌త్తు ఆన్ లైన్ వీడియో స్టీమింగ్ రంగంలోనే ఉంటుంది అన్నారు. అలాంటి రంగంలో ఎంతో ముందున్న‌టు వంటి య‌ప్ టీవీతో అనుబంధం కుదుర్చుకోవ‌డం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. మహేష్

    ఇంటర్నెట్ ప్రపంచం

    ఇంటర్నెట్ ప్రపంచం

    ఇంటర్నెట్ లో టెలివిజన్‌ కార్యక్రమాలను చూసే యువత సంఖ్య రోజురోజుకూ అధికమవుతోందని, రానున్న రెండుమూడేళ్లలో ఇది ఇంకా పెరిగే వీలుందని ఆన్‌లైన్‌ టీవీ ఛానెళ్ల స్ట్రీమింగ్‌ వేదిక యప్‌టీవీ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) ఉదయ్‌ రెడ్డి అన్నారు.

    ఇంటర్నెట్ ఉంటే చాలు

    ఇంటర్నెట్ ఉంటే చాలు

    సంస్థ నూతన ప్రచారకర్తగా మహేశ్‌బాబును నియమించుకున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉదయ్ రెడ్డి మాట్లాడారు. ఇంటర్నెట్‌ ఆధారంగా పనిచేసే ఏ పరికరంలోనైనా టీవీ చూసేందుకు అవకాశం కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు.

    మనదేశంలో అయితే..

    మనదేశంలో అయితే..

    కార్యక్రమాలు ప్రసారం అయిన తర్వాత వారం రోజులపాటు ఎప్పుడైనా చూసే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. మన దేశంలో వీక్షకులు రూ.99, విదేశాల్లోవారైతే 15-20డాలర్ల వరకూ చెల్లించి దాదాపు 300వరకూ దక్షిణాసియా ఛానెళ్లను, 5,000 వరకూ సినిమాలను చూసేందుకు అవకాశం ఉందన్నారు.

    విదేశాల్లో ఉన్నవారికి మన సినిమాలు

    విదేశాల్లో ఉన్నవారికి మన సినిమాలు

    నెలకు 60-70లక్షల మందికి పైగా వీక్షకులు ఉన్నట్లు తెలిపారు. కొత్త సినిమాలు విడుదలైన 4వారాల తర్వాత ‘పే పర్‌ వ్యూ' ద్వారా విదేశాల్లో ఉన్నవారికి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.

    300 కోట్లు పెడతాం

    300 కోట్లు పెడతాం

    ఇప్పటివరకూ రూ.150కోట్ల పెట్టుబడి పెట్టినట్లు.. రానున్న రెండేళ్లలో మరో రూ.300కోట్ల వరకూ పెట్టుబడులకు యోచిస్తున్నామన్నారు ఉదయ్ రెడ్డి. ఈ రంగం మరింత గా విస్తరిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసారు. అందులోనూ మహేష్ లాంటి బ్రాండ్ అంబాసిడర్ తోడు ఉంటే ఇంక చెప్పుకునేదేముంది

    వీక్షకులకి నచ్చివే..

    వీక్షకులకి నచ్చివే..

    య‌ప్ టీవీ సీఈఓ, వ్య‌వ‌స్ధాప‌కులు ఉద‌య్ రెడ్డి మాట్లాడుతూ... ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ద‌క్షిణాసిమా వీడియో కంటెంట్ ను కోరుకునే వీక్ష‌కుల‌కు న‌చ్చిన వీడియోల‌న్నింటినీ అందిస్తూ ఓ టీటీ స్పేస్ లో అగ్ర‌గామిగా నిలిచిన య‌ప్ టీవీ గ‌త కొన్నేళ్లుగా అద్భుత‌మైన ఘ‌ణ‌నీయ‌మైన అభివృద్దిని న‌మోదు చేస్తుంది.

    మహేష్ తో అనుబందం కుదుర్చుకుంది అందుకే

    మహేష్ తో అనుబందం కుదుర్చుకుంది అందుకే

    మా ప్ర‌యాణంలో మా బ్రాండ్ ను మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు భార‌త్ తో పాటు విదేశాల్లోనూ ఎక్కువ మంది అభిమానుల‌ను సంపాదించుకున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో అనుబంధం కుదుర్చుకున్నాం. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రింత మందికి మా బ్రాండ్ ను విస్త‌రింప‌చేసేందుకు ఈ బంధం ఉప‌యోగ‌ప‌డుతుంది అన్నారు.

    ఖాళీగా ఉన్నప్పుడు మహేష్ చేసే పని

    ఖాళీగా ఉన్నప్పుడు మహేష్ చేసే పని

    షూటింగ్ లేనప్పుడు తను టీవీతోనే ఎక్కువ సేపు గడుపుతానని చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ ఖాతాలోకి మరో బ్రాండ్ చేరింది. యప్ టీవీ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు మహేష్. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఛానల్ లోగోను ఆవిష్కరించారు మహేష్ . యుప్ టీవీ కుటుంబంలోకి వచ్చి అనుబంధం పెంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఎంటర్ ట్రైన్ మెంట్ అంతా ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ లోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. పైరసీ కూడా దీనిద్వారా నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు.

    English summary
    YuppTV, the world’s largest online streaming platform for South-Asian content, has announced Tollywood Superstar, Mahesh Babu, as their Brand ambassador.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X