twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రైలర్, పోస్టర్స్ ను మహేష్ బాబు చూసి మెచ్చుకున్నారు(ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ప్ర‌స్థానం'తో నటుడుగా సినిమా ప్రస్దానం మొదలెట్టిన సందీప్‌ కిష‌న్‌ హీరో గా నటించిన తాజా చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు యూ ట్యూబ్ లో ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి . ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం మెచ్చుకోవటం గమనార్హం.

    టక్కరి దొంగ సినిమా రోజుల నుండి దర్శకులు రాజసింహ కు మహేష్ బాబు తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ క్రమం లో నే ఈ చిత్రం ట్రైలర్ ను మహేష్ బాబు కు చూపించటం జరిగింది. చిత్రం కథ గురించి, కథనం గురించి అడిగి తెలుసుకున్న మహేష్ బాబు, రాజసింహ చూపించిన ట్రైలర్ ను చూసి మెచ్చుకున్నారు. చిత్రం లో ని గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా బాగుంది అని ప్రత్యేకం గా మహేష్ బాబు అభినందించారు.

    నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కి జె.మేయర్సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 10 న విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది.

    స్లైడ్ షోలో మహేష్ ..ట్రైలర్ చూస్తున్నప్పుడు ఫొటోలు, మరిన్ని విశేషాలతో చూడండి..

    దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ...

    దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ...

    ‘'నేను జయంత్ గారి వద్ద, అలాగే పరుచూరి బ్రదర్స్ దగ్గర అసోసియేట్ రైటర్ గా వర్క్ చేశాను. ఇండిపెండెంట్ రైటర్ గా కూడా 15 సినిమాలకు పనిచేశాను. 2007లో ఈ సినిమా కథను రాసుకున్నాను . ఇటీవలే మహేష్ బాబు గారిని కలిసి ట్రైలర్ ను చూపించాను. ఆయనకు ట్రైలర్ ఎంతగానో నచ్చింది", అని అన్నారు.

    కథేంటి

    కథేంటి

    కాలేజీ చదువుల్ని మధ్యలోనే మానేసి చుట్టూ వున్న వాళ్లను చదివే ఓ తెలివైన కుర్రాడి ప్రేమకథ. తన ప్రేమకథకి హై టెక్‌ సిటీ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద ఏర్పడ్డ ట్రాఫిక్‌ జామ్‌తో పెద్ద అగాధం ఏర్పడుతుంది. ఆ అగాధం నుంచి ఎలా బయటపడి ప్రేమ విజేతయ్యాడనేది ఒక్క అమ్మాయి తప్ప సినిమా.

    ఎక్కువ భాగం

    ఎక్కువ భాగం

    అరవై శాతం సినిమా ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ట్రాఫిక్‌ జామ్‌ నేపథ్యంలోనే నడుస్తుంది. అక్కడంత భాగం చిత్రీకరించడం సాధ్యం కాదు.

    ఇన్నేళ్లు

    ఇన్నేళ్లు

    అందుకే చాలామటుకు సెట్‌ వేసి తీశాం. ఇది నా సినిమాల్లోనే భారీ వ్యయంతో తెరకెక్కింది. మూడేళ్ల కిందటే రాజసింహ ఈ కథ చెప్పాడు. ఆ విజన్‌ని నమ్మడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది. ఆ సెట్‌ వర్క్‌నంతా మీనియేచర్‌ రూపంలో చూపాడు దర్శకుడు.

    గర్వపడే ..

    గర్వపడే ..

    ఈ కథ నాకు రాసిపెట్టి ఉంది. నేను గర్వపడే సినిమా అవుతుంది. సినిమాలో నిత్యమీనన్‌ భావోద్వేగాల్ని అద్భుతంగా పండించింది. ఇద్దరం సరదాగా ఆటపట్టించుకుంటూ నటించాం.

    నటీ నటులు - సందీప్ కిషన్, నిత్యా మీనన్ , రేవతి , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్,నళిని, జ్యోతి తదితరులు. సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు, మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు : శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ సహ నిర్మాతలు : మాధవి వాసిపల్లి, బోగాది స్వేచ్ రెడ్డి , నిర్మాత: బోగాది అంజిరెడ్డి

    English summary
    Rajasimha showed the theatrical trailer of the movie to Superstar Mahesh Babu recently and Mahesh appreciated the debut director. Mahesh Babu asked details about the story and he went on to commend the visual effects quality in the trailer as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X