‘కృష్ణం వందే జగద్గురుమ్’పై మహేష్ కామెంట్

By Srikanya

హైదరాబాద్ :మహేష్ తాజాగా 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం చూసారు. దగ్గుపాటి రానా హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రెండు రోజుల క్రితం విడుదలైంది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అద్బుతంగా ఉందని మహేష్ ప్రసంసల్లో ముంచెత్తుతున్నారు. ఆయన తన ట్విట్టర్ లో ఈ చిత్రం గురించి రాస్తూ.."కృష్ణం వందే జగద్గురుమ్ అవుట్ స్టాండింగా ఉంది. సినిమా మొత్తం ఎంజాయ్ చేసాను. క్రిష్ కి,రానాకి,మరియు చిత్రానికి పనిచేసిన యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ ", అని ట్వీట్ చేసారు.

ఇక మహేష్ బాబు-దర్శకుడు క్రిష్ కాంబినేషన్ అధికారికంగా ఖరారైన సంగతి తెలిసిందే. అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బేనర్ పై ఈచిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ స్వయంగా వెల్లడించారు. 'కృష్ణం వందే జగద్గురుమ్'ప్రమషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో క్రిష్ మాట్లాడుతూ ఈ విషయాన్ని ఖరారు చేసారు.

ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కంప్లీట్ చేసినట్లు స్పష్టం చేసిన ఈ దర్శకుడు...వచ్చే ఏడాది సమ్మర్లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఈ చిత్రం పూర్తి కమర్షియల్ నేపథ్యంలో రూపొందించేందుకు దర్శకడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని ఆయన స్పష్టం చేసారు.

గమ్యం, వేదం లాంటి చిత్రాలతో క్రిష్ స్టార్ దర్శకుల లిస్టులో చేరి పోయారు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే ఇక ఈ ప్రాజెక్టుపై ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ వార్త అధికారికంగా ఖరారు కావడంలో మహేష్ బాబు అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సిసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం పూర్తయిన తర్వాత మహేష్-క్రిష్ కాంబినేషన్ మొదలు కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X