చెప్పులు ప్రమోట్ చేస్తూ మహేష్ బాబు ఇలా..(ఫోటోస్)
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ....పలు కార్పొరెట్ ప్రొడక్ట్స్‌కి ప్రచారం చేసేందుకు కూడా సమయం కేటాయిస్తున్నాడు. ఇప్పటికే థమ్స్ అప్, వివేల్, ప్రోవోగ్, ఐడియా, నవరత్న ఆయిల్స్, జాస్ అలుక్కాస్, టివిఎస్, రాయల్ స్టాగ్ మొదలైన వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. వీటితో పాటు మహేష్ బాబు ఇటీవల ఫేమస్ చెప్పల్స్ బ్రాండ్ అయిన పారగాన్‌కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసాడు.
ఇటీవల ఈ యాడ్ షూటింగులో కూడా మహేష్ బాబు పాల్గొన్నాడు. 'టఫ్ అండ్ స్టైలిష్' పేరుతో న్యూ కలెక్షన్ చెప్పల్ ఈ రోజు హైదరాబాద్‌లో మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ 2020 నాటికి రూ. 5వేల కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
స్లైడ్ షోలో ఈ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు...

మహేష్ బాబు మాట్లాడుతూ..
పారగాన్ ఆఫీస్ చెప్పల్ ఎంతో మన్నిక కలిగి ఉంటాయని, స్టైలిష్‌గా ఉంటాయని, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటాయని మహేష్ బాబు తెలిపారు.

చెప్పులు ప్రమోట్ చేస్తూ..
పారగాన్ సంస్థ తయారు చేసిన టఫ్ అండ్ స్టైలిష్ చెప్పులను ప్రదర్శిస్తూ మహేష్ బాబు ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

అభిమానితో...
పారగాన్ చెప్పల్ ప్రమోషన్ కార్యక్రమంలో ఓ అభిమానితో కలిసి మహేష్ బాబు ఇలా....

మహేష్ బాబు లుక్
పారగాన్ చెప్పల్ కార్యక్రమంలో మహేష్ బాబు లుక్


Click it and Unblock the Notifications