»   » ధోనీ, విరాట్ కోహ్లిలతో పాటు... మహేష్ బాబు కూడా!

ధోనీ, విరాట్ కోహ్లిలతో పాటు... మహేష్ బాబు కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : మహేష్ బాబు ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరింది. ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఇతర కంపెనీల పోటీని తట్టుకునేందుకు తమ సంస్థకు ప్రచార కర్తగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును నియమించుకుంది దేశీయ ద్విచక్ర వాహనాల సంస్థ టీవీఎస్ మోటార్స్. ఇప్పటికే ఈ సంస్థకు టీమిండియా కోప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

సౌతిండియా మార్కెట్లో టీవీఎస్ అమ్మకాలు పెంచే దిశగా మహేష్ బాబుతో ఇక్కడ విస్తృత ప్రచారం చేయించనున్నారు. టీవీఎస్ కొత్తగా ప్రవేశ పెట్టిన Phoenix బైక్‌కు ఆయన ప్రచారం చేయనున్నారు. మహేష్ బాబు స్టార్ ఇమేజ్ వల్ల తమ అమ్మకాలు పెరుగుతాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కంపెనీ ప్రతినిధులు. ఈ డీల్‌కు గాను మహేష్ బాబుకు భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు ఇప్పటికే అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. మహింద్రా ట్రాక్టర్, థమ్సప్, సంతూర్, ఐడియా, వివెల్ షాంపూ, రాయల్ స్టాగ్, జోయ్ అలుకాస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, అనేక షాపింగ్ మాల్స్, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రచారం చేస్తున్నాడు.

ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా ఈ రేంజిలో యాడ్స్ ద్వారా సంపాదించడం లేదు. మరో వైపు అటు వరుస సినిమా హిట్లతో మహేష్ బాబు టాప్ రేంజిలో కొనసాగుతున్నారు. టాలీవుడ్లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో మహేష్ బాబుటాప్ పొజిషన్లో ఉండటం గమనార్హం.

English summary
TVS Motor Company inducts Bollywood/Tollywood star Mahesh Babu as its brand ambassador. He joins TVS' other brand ambassadors Indian cricket captain M.S. Dhoni, Virat Kohli and actress Anushka Sharma. Mahesh Babu will associate with TVS motorcycle Phoenix initially and endorse other products.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu