మహేష్ బాబు మల్టీ మిలియనీర్...

By Bojja Kumar

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ బాబు మల్టీ మిలియనీర్(ధనవంతుడు)గా కనిపించబోతున్నాడు. ఇందులో అతని లుక్, స్టైల్ పూర్తిగా డిఫరెంటుగా కనిపించబోతున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఉగాదికి ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటిస్తోంది. జగపతి బాబు మహేష్ బాబు తండ్రి పాత్ర పోషిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Mahesh Babu as a millionaire

ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నీ చిత్రానికి ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం పొల్లాచ్చిలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వం ఈ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు.

ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్, ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X