ఆ యాడ్ లోనూ మహేష్ బాబు పోలీసే...
మహేష్ బాబుకి పోకిరి చిత్రం నుంచి పోలీస్ క్యారెక్టర్ బాగా అచ్చివచ్చినట్లుంది. మొన్న దూకుడులోనూ దాన్ని కంటిన్యూ చేసి సూపర్ హిట్ ఇచ్చారు. దాంతో ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న ఐడియా సెల్యులార్ వారి యాడ్ లోనూ పోలీస్ గానే కనిపించి అలరిస్తున్నాడు. ఐడియావారి కొత్త యాడ్ లో మహేష్ బాబు పోలీస్ గా అదరకొట్టాడు. ఇక బిజినెస్ మ్యాన్ సూపర్ హిట్ కావటంతో మహేష్ బ్రాండ్ విలువ అమాంతం రెట్టింపు అయ్యింది. దాంతో ఇప్పటికే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మహేష్ బాబు త్వరలో మరిన్ని వాణజ్య ప్రకటనల్లో కనిపించనున్నారు. తాజాగా సంతూర్ ప్రచార బాధ్యతలను పంచుకునేందుకు అంగీకరించిన మహేష్ ఈ సంవత్సరం మరో నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని అంచనా.
ఇక మరో మూడు కంపెనీలు ఇప్పటికే ఆయన్ను తమ బ్రాండ్ల కోసం సంప్రదించాయని తెలుస్తోంది. వీటిల్లో ప్రముఖ ఫుడ్ ప్రొడక్ట్ సంస్థ, మరో హెల్త్ డ్రింక్ బ్రాండ్ ఉన్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే అమృతాంజన్, నవరత్న ఆయిల్, యూనివర్సెల్, థమ్స్ అప్, ఐడియా సెల్యులార్, జాస్ అలుక్కాస్, ప్రొవోగ్, గిల్లెట్, వివెల్ షాంపూలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల తొలి వారంలో దేశంలో అతిపెద్ద సోప్ బ్రాండ్‌గా ఉన్న సంతూర్ ప్రమోషన్ కోసం విప్రో సంస్థ మహేష్‌ను ఆశ్రయించింది. ఈ కంపెనీ వ్యాపార ప్రకటనను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. అలాగే ప్రస్తుతం మహేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చిత్రంలో చేస్తున్నారు. ఆ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తారు. వీటిన్నటి తర్వాత బిజినెస్ మ్యాన్ 2 చేస్తారు.


Click it and Unblock the Notifications











