మహేష్ బాబు ‘రాక్ స్టార్’ పాత్రలో..?
హైదరాబాద్: మహేష్ బాబు కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొన్ని నెలలుగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్ర షూటింగ్‌లో బిజీగా వున్న మహేష్ బాబు ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.
ఇందులో మహేష్ బాబు అధ్యాపకుడి పాత్రను పోషిస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆయన రాక్‌స్టార్‌గా కనిపించబోతున్నారని తెలిసింది. ఈ చిత్ర తరువాత షెడ్యూల్ అక్టోబర్ 10 నుండి గోవాలో మొదలు కానుంది. ఆసక్తికరంగా మహేష్ బాబు గత చిత్రం "బిజినెస్ మాన్" కూడా గోవాలో చిత్రీకరించారు. సుకుమార్ మరియు మహేష్ బాబు మొదటి సారి కలిసి చిత్రం చేస్తుండటంతో చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ ని ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం అయన అమెరికా నుండి ప్రత్యేకంగా ట్రైనర్ ని కూడా తెచ్చుకున్నారు. ఈ చిత్రం 2013 వేసవికి విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











