‘దూకుడు’పంక్షన్ లో మహేష్ మాటలు...
శనివారం సాయంత్రం విజయవాడలో జరిగిన 'దూకుడు" అర్ధశతదినోత్సవంలో మహేష్ చాలా ఉద్వేగంగా ప్రసంగించారు.కృష్ణ, మహేష్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయిన ఈ ఫంక్షన్ లో మష్‌బాబు మాట్లాడుతూ ..''విజయవాడలో నేను రెండోసారి విజయోత్సవాన్ని చేసుకొంటున్నాను. ఇంతమంది ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోలేను. దూకుడు చిత్రంలో నటించడం మంచి అనుభవం. అందరూ తదుపరి సినిమా గురించి అడుగుతున్నారు. అదీ త్వరలోనే మీ ముందుకు వస్తుంది.అలాగే దూకుడు చిత్రం ఇన్ని రికార్డులు సాధించటానికి అభిమానులే కారణం. నాన్నను అభిమానించినవాళ్లే నాకు అభిమానులుగా మారటం అదృష్టం.
50 రోజుల క్రితం నాన్నగారు ఈ సినిమా చూసి 80 కోట్లు వసూలు చేస్తుందని చెప్పారు. 'ఈ సినిమాలో నువ్వు చాలా అందంగా ఉన్నావ్. చాలా బాగా చేశావ్" అని నన్ను అభినందించారు. ఆయన మాటలు ఇంకా నా చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. నా జీవితంలోనే అవి గొప్పగా చెప్పుకునే కాంప్లిమెంట్స్. నాకు 'దూకుడు" లాంటి విజయాన్ని ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్లకు రుణపడి ఉంటాను. తను నాన్న అభిమాని కావడం కూడా ఈ సినిమా బాగా తీయడానికి ఒక కారణం""అని మహేష్‌బాబు అన్నారు.
కృష్ణగారి కళ్లలో ఆనందం చూడాలన్న పట్టుదలతో ఈ సినిమా చేశానని, మహేష్ అంటే తనకు ఎంతో అభిమానం అని, 'దూకుడు" చిత్రీకరణ సమయంలో తన పట్టుదల చూసి ఎన్నిసార్లు షాకయ్యానో లెక్కలేదని, మహేష్‌తో ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని ఉందని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు.విజయనిర్మల, ఆదిశేషగిరిరావు, డి.సురేష్‌బాబు, నిర్మాతలు రామ్ ఆచంట, గోపినాథ్ ఆచంట, అనిల్ సుంకరలతో పాటు సమంత, సి.అశ్వనీదత్, సుకుమార్, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











