twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజ్మీర్ దర్గా లో మహేష్ బాబు ప్రార్ధనలు

    By Srikanya
    |

    హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు...అజ్మీర్ దర్గాని నిన్న గురువారం దర్శించినట్లు సమాచారం. ఈ మేరకు ఓ ఇంగ్లీష్ డైలీ వార్తను ప్రచురించింది. దూకుడు విజయవంతం అయిన తర్వాత రెగ్యులర్ గా మహేష్ ..ఆ దర్గాని సందర్శిస్తున్నారు. బిజినెస్ మ్యాన్ రిలీజ్ కు ముందు కూడా ఆయన అక్కడకి వెళ్ళి ప్రార్దనలు చేసారు.

    ఈ సంవత్సరంలో ఈ దర్గాకు వెళ్లటం రెండో సారి. పిబ్రవరిలో మహేష్ ఓ సారి ఈ దర్గాకు వెళ్లి ప్రార్దనలు చేసి వచ్చారు. సంక్రాంతి కి విడుదల అవుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం విజవంతం కావాలని ఈ సారి దర్గాని దర్శించినట్లు చెప్తున్నారు. మహేష్ కు ఓసారి నమ్మకం ఏర్పడితే దాన్ని పూర్తిగా ఫాలో చేస్తారని ఆయన సన్నిహితులు చెప్తారు.

    వెంకటేష్‌, మహేష్‌బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. అడ్డాల శ్రీకాంత్ దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మహేష్ సరసన సమంత,వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్స్ గా చేస్తున్నారు. వెంకటేష్,మహేష్ బాబు అన్నదమ్ములుగా ఈ చిత్రంలో కనపించనున్నారు. అంజలి..మహేష్ కు వదినగా చేస్తోంది.

    ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి. 'అమ్మను నువ్వు చూసుకో - నాన్న నా దగ్గర ఉంటాడు. లేదంటే ఇద్దర్నీ చెరో ఆరు నెలలూ భరిద్దాం' - ఇలాంటి లెక్కలు వింటూనే ఉన్నాం. అందుకే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయింది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు.

    అలాగే ...''పేరులోనే కాదు, సినిమాలోనూ తెలుగుదనం కనిపిస్తుంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం మంచి కథ ఉంటేనే సాధ్యం. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేశాము''అని దర్శకుడు చెప్తున్నారు. ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్‌, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.

    ఆస్తిపాస్తుల ముందు అన్నదమ్ముల బంధాలకు విలువ లేని కాలమిది. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకొంటూ ఎవరి బతుకులు వాళ్లు బతికేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా నాన్న దగ్గర చేసిన వాగ్ధానం కోసం ఆ అన్నదమ్ములు ఏం చేశారో తెర మీదే చూడాలంటున్నారు దిల్‌ రాజు. ఆయన నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'...అలాగే మల్టీస్టారర్‌ చిత్రాల్లో ఇదో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని, అనుబంధాల విలువనీ హృద్యంగా చెప్పే ప్రయత్నమిది అన్నారు . సంగీతం: మిక్కీ జే.మేయర్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

    English summary
    Mahesh Babu visited the Ajmer Dargah on Wednesday, according to his close associates. After the success of Dookudu, the actor has been regularly visiting the Dargah. He was spotted there before the release of Businessman too. This will be his second visit this year. He headed to Ajmer earlier in February, when he was shooting for his film. This time around, the actor went to the Dargah, ahead of the Sankranti release of Seethamma Vakitlo Sirimalle Chettu, that also stars Venkatesh .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X