twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తలబిరుసు అనుకొన్నా:మహేష్ బాబు(ఆడియో పంక్షన్ ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్: పెద్ద హీరోలు తమ ఆడియో పంక్షన్ కి వస్తున్నాడంటే ఆ క్రేజే వేరు. ముఖ్యంగా ఆయన అభిమానులంతా ఈ ఫంక్షన్ కి హాజరవుతారు. అదే సమయంలో మీడియా కవరేజ్ కూడా ఓ రేంజిలో ఉండి..బిజినెస్ కు ప్లస్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద హీరోలను ఆడియో పంక్షన్స్ పిలిచి చిన్న సినిమా వారు లాభపడాలని చూస్తారు. మహేష్ బాబు కూడా అదే రీతిలో తమ రెలిటివ్స్ పంక్షన్స్ కు హాజరవతూ ఆ సినిమాలకు క్రేజ్ తెస్తున్నారు.

    తన సోదరి భర్త సుధీర్ బాబు సినిమాల ఆడియో పంక్షన్స్ కే ఇన్నాళ్ళూ హాజరైన మహేష్ బాబు ఇప్పుడు తమ రెలిటివ్ హీరోగా పరిచయం అవుతున్న 'హృదయం ఎక్కడున్నది' చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.

    ఈ చిత్రం ద్వారా రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి మేనల్లుడు కృష్ణ మాధవ్ హీరోగా పరిచయం అవుతున్నారు. కన్నడ భామ అనూష, మళయాల భామ సంస్కృతి షినోయ్ హీరోయిన్లు. ఈ చిత్రం ఆడియో హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

    ఆడియో లాంచ్ విశేషాలు...స్లైడ్ షోలో...

    మహేష్ చేతుల మీదుగా

    మహేష్ చేతుల మీదుగా

    మహేష్ చేతుల మీదుగా ఈ చిత్రంలోని గీతాలు మంగళవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. మహేష్ అభిమానులు హర్ష ధ్వానాల మధ్య ఈ ఆడియో పంక్షన్ ఘనంగా జరిగింది. అందరి దృష్టినీ ఆకర్షించింది.

    అరుణకుమారికి...

    అరుణకుమారికి...

    తొలి సీడీని మహేష్ బాబు ఆవిష్కరించి రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారికి అందించారు. అందరూ స్టేజిపైకి వచ్చారు. మీడియా మొత్తం మహేష్ ని కవర్ చేసే పనిలో పడిపోయింది.

    మహేష్‌బాబు మాట్లాడుతూ...

    మహేష్‌బాబు మాట్లాడుతూ...

    ''ఖలేజా, దూకుడు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు కృష్ణ మాధవ్‌. అతను తొలిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం విజయవంతం కావాలి'' అన్నారు.

    మహేష్ కంటిన్యూ చేస్తూ...

    మహేష్ కంటిన్యూ చేస్తూ...

    ''కృష్ణమాధవ్‌ నాకు 'ఖలేజా' సినిమా చేస్తున్నప్పటి నుంచీ బాగా తెలుసు. పెద్దింటి నుంచి వచ్చాడు కదా, తలబిరుసు ఉంటుందేమో అనుకొన్నా. కానీ తనలో కష్టపడే తత్వం నాకు బాగా నచ్చింది'' అన్నారు మహేష్‌ బాబు.

    హీరో,హీరోయిన్స్

    హీరో,హీరోయిన్స్

    కృష్ణమాధవ్‌ హీరోగా నటించిన చిత్రమిది. అనూష, సంస్కృతి హీరోయిన్స్ . విఐ.ఆనంద్‌ దర్శకుడు. పవన్‌ మంత్రిప్రగడ, సంజయ్‌ ముప్పనేని నిర్మాతలు. విశాల్‌ చంద్రశేఖర్‌ బాణీలు అందించారు.

    దర్శకుడు మాట్లాడుతూ...

    దర్శకుడు మాట్లాడుతూ...

    ''మురుగదాస్‌ దగ్గర శిష్యరికం చేశా. ఆయన చెప్పిన జాగ్రత్తలు పాటించే ఈ సినిమా తీశా. విభిన్నమైన భావోద్వేగాలు నిండిన వినోదాత్మక కథ ఇది'' అన్నారు.

    హీరో కృష్ణమాధవ్‌ మాట్లాడుతూ...

    హీరో కృష్ణమాధవ్‌ మాట్లాడుతూ...

    ''సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయంలో మహేష్‌ నాకు స్ఫూర్తి. ఆయనలోని అంకితభావం, క్రమశిక్షణ నాకు ఆదర్శం'' అని కృష్ణమాధవ్‌ చెప్పారు.

     గల్లా అరుణకుమారి మాట్లాడుతూ...

    గల్లా అరుణకుమారి మాట్లాడుతూ...

    ''మా మేనల్లుడు మాధవ్‌ సినిమాల్లోకి రావడం ఆశ్చర్యంగా ఉంది. 'హాయిగా అమెరికాలో ఉద్యోగం చేసుకో' అని చెప్పేదాన్ని. కానీ వినలేదు. ఇన్నాళ్లకు తన తపన ఈ సినిమాతో నెరవేర్చుకొన్నాడు'' అన్నారు.

    సంగీత దర్శకుడు మాట్లాడుతూ...

    సంగీత దర్శకుడు మాట్లాడుతూ...

    ''మంచి సాహిత్యం అందించిన గీతరచయితలకు కృతజ్ఞతలు...దర్శకుడు తను అనుకున్న విధంగా ఈ ఆడియోని నా చేత చేయించుకున్నారు'' అని సంగీత దర్శకుడు చెప్పారు.

    బిజీ షెడ్యూల్ లోనూ...

    బిజీ షెడ్యూల్ లోనూ...

    మహేష్ ఎంత బిజీయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు సినిమాల షూటింగులు, మరో వైపు వాణిజ్య ప్రకటనల ప్రమోషన్స్‌తో తీరిక లేకుండా గడుపుతుంటారు. అందుకే ఆయన ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కార్యక్రమాలకు ఆయన హాజరయ్యేది చాలా అరుదు.

    బంధుత్వంతోనే...

    బంధుత్వంతోనే...

    అమెరికాలో చదువుకున్న కృష్ణ మాధవ్ సినిమాల పట్ల ఆసక్తితో ఈ రంగంలో అడుగు పెట్టారు. గతంలో ఆయన మహేష్ బాబు నటించిన పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేసారు. వీరి మధ్య బంధుత్వం తో ఈ ఫంక్షన్ కి హాజరయినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

    దర్శక,నిర్మాతలు...

    దర్శక,నిర్మాతలు...


    పవన్, సంజయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ శిష్యుడు వి. ఆనంద్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

    సినిమాటోగ్రఫీ...

    సినిమాటోగ్రఫీ...

    హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ బెన్ హుడ్సన్ వద్ద శిష్యరికం చేసిన ప్రసాద్ జి.కె సినిమాగ్రఫీ అందిస్తుండటం విశేషం.

    రహమాన్ శిష్యుడు...

    రహమాన్ శిష్యుడు...

    ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంటుగా పని చేసిన విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఆడియో మంచి విజయం సాధిస్తుందని చెప్తున్నారు.

    ఈ చిత్రంలో...

    ఈ చిత్రంలో...

    హర్ష వర్ధన్, ఆహుతి ప్రసాద్, ధన్ రాజ్, పృథ్వి, ఫణి, రజిత, అనత్ తదితరులు నటిస్తున్నారు. టెక్నికల్ గానూ ఈ చిత్రం మంచి స్టాండర్డ్స్ తో ఉంటుందని చెప్తున్నారు.

    మహేష్ ఫ్యామిలీనుంచి మూడో హీరో...

    మహేష్ ఫ్యామిలీనుంచి మూడో హీరో...

    మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే వెండి తెరకు ఇద్దరు హీరోలు పరిచయం అయిన సంగతి తెలిసిందే. సుధీర్ బాబు ‘ఎస్ఎంఎస్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవ్వగా, ఆయన మరో బంధువు శివ ‘జగన్' చిత్రం ద్వారా ఇటీవలే వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం కృష్ణ మాధవ్ ‘హృదయం ఎక్కడున్నది' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు.

    నిర్మాతలు మాట్లాడు తూ-...

    నిర్మాతలు మాట్లాడు తూ-...

    ‘‘కృష్ణమాధవ్‌, సంస్కృతి జంట రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది.ఆడియో పంక్షన్ కు విచ్చేసినందుకు మహేష్ కు ధాంక్స్'' అన్నారు

    మహేష్ క్రేజ్ కోసమే...

    మహేష్ క్రేజ్ కోసమే...

    ఇలా ఆడియో పంక్షన్ నిర్వహించటం,మహేష్ రావటం ఏమిటనేది మీడియా వర్గాల్లో చర్చగా మారింది. కేవలం వారికి క్రేజ్ రావటం కోసం..అడ్డుపెట్టుకుని, బిజినెస్ చేసుకునే ప్రయత్నమని వ్యాఖ్యానాలు వినిపించాయి.

    ట్రైలర్స్...

    ట్రైలర్స్...

    ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మహేష్ సైతం వీటిని వీక్షించారు. ఓ ప్రేమ కధా చిత్రంగా ఈ చిత్రం రూపొందిందని తెలిపేలా ఆ ట్రైలర్స్ రూపొందాయి.

     ఈ కార్యక్రమంలో....

    ఈ కార్యక్రమంలో....

    చిత్రబృందంతో పాటు సుధీర్‌ బాబు, జయదేవ్‌ గల్లా, పద్మ, భీమనేని శ్రీనివాసరావు, అనిల్‌సుంకర, జెమినీ కిరణ్‌, హర్షవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Super Star Mahesh Babu is going to attend and grace the audio function of 'Hrudhayam Ekkadunnadhi'. Mahesh babu's relative Krishna Madhav is making his debut as the hero with a film titled 'Hrudhayam Ekkadunnadhi'. He is also the nephew of minister Galla Aruna kumari.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X