twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీష్ స్టేషన్లో మహేష్ బాబు!

    By Bojja Kumar
    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సారథి స్టూడియోలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగులో పాల్గొంటున్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ బ్యాగ్రౌండ్లో జరుగుతున్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రేపు కూడా ఇక్కడే షూటింగ్ జరుగనుందని యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం.

    ఈచిత్రంలో మహేష్ బాబు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

    సినిమా కథ విషయానికొస్తే... గోవా బ్యాక్‌ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు.

    మరో వైపు మహేష్ బాబు ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి ప్రధాన పాత్రలుగా మల్టీ స్టారర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.

    English summary
    Superstar Mahesh Babu is currently shooting at Saradhi Studios for his film with director Sukumar. A few sequences are being canned with a police station background and the unit will shoot there tomorrow as well. Kajal Aggarwal is the heroine in this movie. The film is being produced on 14 Reels Entertainment banner and Devi Sri Prasad is scoring the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X