ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో మహేష్ బాబు
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సెప్టెంబర్ 18న ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ఆఫీసులో దర్శనం ఇచ్చారు. ఆయన కొత్తగా కొనుగోలు చేసిన టయోటా లాండ్ క్రూయిజర్ కార్ రిజిస్టర్ చేసుకునేందుకు ఆయన స్వయంగా ఆర్టీఏ ఆఫీసుకు వచ్చి డిజిటల్ థింక్ ప్యాడ్ పై సంతకం చేసారు. కారు నెంబర్ AP 09 CM 4005.
ఈ కారును తనకుమారుడు గౌతం కోసం కొన్నాడట మహేష్ బాబు. మహేష్ బాబు ఆర్టీఏ ఆఫీసుకు రావడంతో జనం ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. ప్రాంతీయ రవాణా అధికారి చంద్రశేఖర్ గౌడ్, ఎంవీఐ విజయరావు వాహన రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తి చేసారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల తనయుడు గౌతం కృష్ణ ఆగస్టు 31న 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తనయుడికి ఖరైదీన కారు(టాయోటా ల్యాండ్ క్యూయిజర్) గిఫ్టుగా కొనిచ్చాడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...గౌతం ఇప్పటి నుంచే కారు నడపడంలో ట్రైనింగ్ అవుతున్నాడట.
తండ్రి పక్కన కూర్చుంటే స్వయంగా నడుపుతాడని, త్వరలోనే పూర్తి స్థాయిలో సొంతగా కారు నడిపే స్థాయికి వస్తాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తనయుడి కోసం ఖరీదైనకారు కొని ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీ స్టారర్ చిత్రంలో వెంకటేష్ మరో హీరోగా చేస్తున్నాడు. సమంత, అంజలి హీరోయిన్లు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











