»   » పెళ్లి వేడుకలో మహేష్ బాబు ఫ్యామిలీ సందడి (ఫోటోస్)

పెళ్లి వేడుకలో మహేష్ బాబు ఫ్యామిలీ సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య 'జగన్ నిర్దోషి' అనే టైటిల్ తో ఓ సినిమా వచ్చింది...గుర్తుందా? ఆ సినిమాలో హీరోగా నటించిన శివ వివాహం అనూషతో ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. మహేష్ బాబు బంధువు, నిర్మాత మల్లికార్జునరావు కుమారుడే ఈ శివ.

వెడ్డింగ్ రిసెప్షన్‌కు మహేష్ బాబుతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరయ్యారు. మహేష్ బాబు తండ్రి కృష్ణ, తల్లి ఇదిరాదేవి, సోదరి ప్రియదర్శిని తదితరులు ఈ వివాహ వేడుకలో సందడి చేసారు. అయితే మహేష్ బాబు భార్య నమ్రత, పిల్లలు గౌతం, సితారలు పూణెలో ఉండటంతో హాజరు కాలేదని తెలుస్తోంది.

'జగన్ నిర్దోషి' సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెదామని శివ చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి. ఆ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో శివ మళ్లీ నటనవైపు చూడలేదు. తమ కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారాలను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

స్లైడ్ షోలో వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోస్...

మహేష్ బాబు

మహేష్ బాబు

శివ-అనూష వెడ్డింగ్ రిసెప్షన్ లో మహేష్ బాబు.

కృష్ణ ఆశీర్వాదం

కృష్ణ ఆశీర్వాదం

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న కృష్ణ, విజయ నిర్మల దంపతులు.

ఇందిరా దేవి, ప్రియదర్శిని

ఇందిరా దేవి, ప్రియదర్శిని

శివ-అనూష వెడ్డింగ్ రిసెప్షన్ లో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి, సోదరి ప్రియదర్శిని.

బంధువుల

బంధువుల

వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో మహేష్ బాబు సోదరి, బంధువులు.

ఆర్ నారాయణ మూర్తి

ఆర్ నారాయణ మూర్తి

వెడ్డింగ్ రిసెప్షన్ కు విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి కూడా హాజరయ్యారు.

ఇందిరా దేవి

ఇందిరా దేవి

వెడ్డింగ్ రిసెప్షన్ లో ఇందిరా దేవి.

దాసరి

దాసరి

శివ-అనూష వెడ్డింగ్ రిసెప్షన్ లో దర్శకరత్న దాసరి నారాయణ రావు.

మహేష్ బాబు

మహేష్ బాబు

వెడ్డింగ్ రిసెప్షన్ లో మహేష్ బాబు.

దాసరి, ఆర్ నారాయణ మూర్తి తదితరులు

దాసరి, ఆర్ నారాయణ మూర్తి తదితరులు

వెడ్డింగ్ రిసెప్షన్ లో దాసరి, ఆది శేషగిరిరావు, ఆర్ నారాయణ మూర్తి తదితరులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu