తెలుగులో నాకు పోటీ వాళ్ళే: మహేష్ బాబు
వరుసగా రెండు సూపర్ హిట్స్ ఇచ్చాను. నెంబర్ వన్ స్థానం గురించి నేను మాట్లాడను. పోటీ ప్రసక్తి వస్తే..తెలుగులో ఉన్న హీరోలందరూ నాకు పోటీయే అన్నారు మహేష్ బాబు.'బిజినెస్‌మేన్'హెక్సా ప్లాటినమ్ పంక్షన్ ను హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు, కృష్ణ, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మహేష్ పై విధంగా స్పందంచారు.
అలాగే బిజినెస్ మ్యాన్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించడానికి కారణం అడగగా.. ఇది కుటుంబ కథ అని ఎప్పుడూ చెప్పలేదు. మాఫియా సినిమా అని ముందే చెప్పాను అన్నారు. ఇక బిజినెస్ మ్యాన్ హిట్టవటానికి కారణం.. సంభాషణలు, వైవిధ్యమైన పాత్ర చిత్రణ అని తేల్చి చెప్పారు. ఇక ఈ చిత్రం ఈ సినిమాను 74 రోజుల్లో పూర్తి చేశాను. ఇకపై వచ్చే చిత్రాల్నీ ఇంతే వేగంగా చేస్తాను. నా సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడికి నాంది పలికాను. కొనసాగిస్తాను అని అన్నారు. ఇక దాసరి మాట్లాడుతూ ''తెలుగు సినిమా సత్తాను మూడుసార్లు చూపించిన హీరో మహేష్‌బాబు. పోకిరి, దూకుడు... ఇప్పుడు బిజినెస్‌మేన్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు అన్నారు.
మహేష్ తండ్రి కృష్ణ మాట్లాడుతూ.. ''నేను అనుకొన్నట్లుగా దూకుడుని మించిన విజయాన్ని సాధించిందీ చిత్రం. పూరి సంభాషణల్ని మహేష్ తప్ప ఇంకెవరు చెప్పినా బాగోవు'' అన్నారు.


Click it and Unblock the Notifications











