అద్బుతంగా నటించాడంటూ మహేష్ బాబు ప్రశంసలు
మహేష్ బాబు రీసెంట్ గా విడుదలైన "గుజారిష్" చిత్రాన్ని దుబాయ్ లో చూసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...హృతిక్ రోషన్ ది ఫైవ్ స్టార్ ఫెరఫార్మెన్స్..అలాంటి అధ్బుతమైన నటన చూడటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అవుట్ స్టాండింగ్ అని మెచ్చుకున్నారు. ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్ ల కాంబినేషన్ లో వచ్చిన గుజారిష్ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ డైరక్ట్ చేసారు. గుజారిష్ చిత్రంలో హృతిక్ రోషన్... ఇంద్రజాలికుడి గా అనంతరం శరీరం చచ్చుబడిపోయిన ఓ యువకుడుగా తనకు మరణభిక్ష పెట్టాలని కోరుకునే వ్యక్తిగా కనిపించారు. ఐశ్వర్య రాయ్ తన భర్త నుంచి విడిపోయిన ఓ నర్సు పాత్రలో జీవించింది. ఇక మహేష్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రంలో చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్..పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.
మహేష్ బాబు దూకుడు సమంత గుజారిష్ హృతిక్ రోషన్ ఐశ్వర్య రాయ్ mahesh babu hrithik roshan guzarish sanjay leela bansali


Click it and Unblock the Notifications