మహేశ్‌బాబు, బాలకృష్ణ మల్టీస్టారర్.. ఆ డైరెక్టర్ సెట్ చేశాడట..

By Rajababu

Recommended Video

మహేశ్‌బాబు, బాలకృష్ణ మల్టీస్టారర్

టాలీవుడ్‌లో మళ్లీ మల్టీస్టారర్ల హంగామా మొదలైంది. అడప దడపా చిన్న హీరోల చిత్రాలు వస్తున్నప్పటికీ.. సూపర్‌స్టార్లు కలిసి ఈ మధ్యకాలంలో నటించిన దాఖలాలు తక్కువే. కానీ వచ్చే ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్ల మూవీలు సందడి చేయనున్నాయి. అయితే మరోసారి మహేశ్‌బాబు, బాలకృష్ణ మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త ప్రచారం జరుగుతున్నది.

 బోయపాటి స్కెచ్‌ ఇది..

బోయపాటి స్కెచ్‌ ఇది..

ఈ మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించిన వార్తకు అసలు కారణం దర్శకుడు బోయపాటి శ్రీను. టాలీవుడ్‌లో బాలకృష్ణతో సినిమా చేసిన అనుభవం బోయపాటికి ఉంది. బాలయ్యకి బోయపాటి అంటే చాలా ఇష్టం. సింహా, లెజెండ్ చిత్రాలతో బోయపాటి తనకు మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టారు. తనకు స్టార్ హోదాకు బలం చేకూర్చిన డైరక్టర్ కావడంతో అతని మాట కాదనరు. దాంతోనే ఈ క్రేజీ కాంబినేషన్‌ను బోయపాటి సెట్ చేసినట్టు వార్త వినిపిస్తున్నది.

 క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

ఇదిలా ఉండగా మాస్ డైరెక్టర్‌గా మంచి పేరు ఉన్న బోయపాటితో మహేశ్ సినిమా చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే మహేశ్‌కు, బాలయ్యకు సరిపడే కథను వినిపించి బోయపాటి క్రెడిట్ కొట్టేశారనేది తాజా సమాచారం. కథ నచ్చడంతో ఈ క్రేజీ కాంబినేషన్‌కు బాలయ్య, మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

కొరటాల శివతో మహేశ్ బాబు

కొరటాల శివతో మహేశ్ బాబు

ప్రస్తుతం మహేశ్‌బాబు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భరత్ అనే నేను చిత్రంతో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి నుంచి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభం కానున్నది. ఈ రెండు సినిమాల తర్వాత బాలకృష్ణతో కలిసి నటించేందుకు మహేశ్‌బాబు ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించడానికి 14రీల్స్ సంస్థ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

మహేశ్‌బాబుతో వంశీ పైడిపల్లి చిత్రం

మహేశ్‌బాబుతో వంశీ పైడిపల్లి చిత్రం

మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ కోసం లొకేషన్లను ఎంపిక చేయడానికి దర్శకుడు వంశీ పైడిపల్లి, సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్, తదితరులు ఇటీవల అమెరికా వెళ్లారు. న్యూయార్క్‌లో అందమైన లోకేషన్లను ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది.

 మ్యూజిక్‌తో దేవీ శ్రీ ప్రసాద్ రెడీ

మ్యూజిక్‌తో దేవీ శ్రీ ప్రసాద్ రెడీ

మహేశ్‌బాబు చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ పనులను కూడా రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అల్రెడీ మొదలుపెట్టేశారట. ఇప్పటికే మూడు ట్యూన్లను సిద్ధం చేసినట్టు చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌తో కలిసి మరో నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్నారు.

 మహేశ్‌ బాబుతో పూజా హెగ్డే

మహేశ్‌ బాబుతో పూజా హెగ్డే

ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌గా చేస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అను ఇమ్యానుయేల్, పూజా హెగ్డే పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. హీరోయిన్ ఎంపికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని టాక్. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X