బ్యాంకాక్ లో మహేష్,పూరీ హంగామా
మహేష్ ని దర్శకుడు పూరీ జగన్నాధ్ తన రెగ్యులర్ ప్లేస్ బ్యాంకాక్ కి తీసుకెళ్లారు. అక్కడ తమ తాజా చిత్రం 'బిజినెస్ మేన్'కి పాటలని చిత్రీకరిస్తున్నారు. ఈ విషయమై నిర్మాతలు మాట్లాడుతూ...''మహేష్-పూరి కలయికలో 'పోకిరి' తర్వాత వస్తున్న చిత్రమిది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ నటన, హావభావాలు ఇందులో ప్రత్యేకంగా ఉంటాయి. ముంబయిలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 'ఇలా రౌండప్ చేసి నన్ను కనఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే కన్‌ఫ్యూజ్‌లో ఎక్కువ కొట్టేస్తాను' అనే సంభాషణతో ఇటీవల విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది.
ఈ నెలాఖరు వరకు బ్యాంకాక్‌లో పాటల్ని తెరకెక్కిస్తాం. వచ్చే నెల 1 నుంచి హైదరాబాద్‌లో మహేష్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ తదితరులు పాల్గొనే సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. డిసెంబరు 23న పాటల్ని విడుదల చేస్తామ'' అని అన్నారు. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె నాయుడు, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











