పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టేసిన మహేష్.. ఏకంగా! సూపర్ స్టార్ కెరీర్‌లోనే ది బెస్ట్ రిపోర్ట్

టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకరిని మించి మరొకరు రాణిస్తున్నారు. గత రికార్డులను తిరగరాస్తూ తెలుగు హీరోల సత్తా ఏంటో దేశవ్యాప్తంగా చాటుతున్నారు. ముఖ్యంగా టాప్ స్టార్స్ మధ్య పోటీ వాతావరణం టాలీవుడ్ ఖ్యాతిని మరింత పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ సంక్రాంతి బరిలో నిలిచారు సూపర్ స్టార్ మహేష్ బాబు. 'సరిలేరు నీకెవ్వరు' అంటూ తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని ఏకంగా పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టేశారు. వివరాల్లోకి పోతే..

 సంక్రాంతి సందడి.. సరిలేరు నీకెవ్వరు

సంక్రాంతి సందడి.. సరిలేరు నీకెవ్వరు

ఈ సంక్రాంతి సందర్బంగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు మూవీకి ప్రేక్షకలోకం బ్రహ్మరథం పడుతోంది. చిత్రంలో మహేష్ మాస్ పర్‌ఫార్‌మెన్స్‌తో ఇరగదీశారని అంటున్నారు జనం. ఈ మేరకు అన్ని సెంటర్స్‌లో మూడు రోజుల ముందే సంక్రాంతి సందడి మొదలైంది.

తొలిరోజే.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

తొలిరోజే.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

''నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్'' అన్నట్లుగా 'సరిలేరు నీకెవ్వరు' బొమ్మ దద్దరిల్లిపోయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. ఈ మేరకు తొలి రోజే ఈ సినిమా 46.77 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వసూలు చేసింది.

 ప్రభుత్వ అనుమతి.. మహేష్ జోరు

ప్రభుత్వ అనుమతి.. మహేష్ జోరు

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు ప్రభుత్వ అనుమతి లభించడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. బాక్సాఫీసు దద్దరిల్లిపోయేలా రికార్డు స్థాయిలో ఈ సినిమా ఓపెనింగ్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి తొలిరోజు రూ.32.77 కోట్ల షేర్ నమోదు చేసింది సరిలేరు నీకెవ్వరు.

తన సినిమాను తానే బీట్ చేస్తూ..

తన సినిమాను తానే బీట్ చేస్తూ..

మహేష్ బాబు కెరీర్‌లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో ఇదే హయ్యస్ట్ ఓపెనింగ్ డే ఫిగర్ కావడం విశేషం. ఆయన 25వ సినిమా ‘మహర్షి' తొలిరోజు 24.68 కోట్లు రాబట్టి రికార్డు నెలకొల్పగా, ఇప్పుడు ఆ రికార్డును ‘సరిలేరు నీకెవ్వరు'తో తిరిగి బ్రేక్ చేశారు మహేష్ బాబు. ఇక ఓవరాల్‌గా చూస్తే టాలీవుడ్ తొలిరోజు కలెక్షన్ల రికార్డులో ‘సరిలేరు నీకెవ్వరు' నాలుగో స్థానంలో నిలిచింది.

పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టేస్తూ

పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టేస్తూ

తొలిరోజు కలెక్షన్ల రికార్డులో అగ్రస్థానంలో 43 కోట్ల రూపాయలతో ‘బాహుబలి 2' ఉండగా.. ఆ తరవాత 36.63 కోట్లతో 'సాహో', 36.37 కోట్లతో ‘సైరా' ఉన్నాయి. నాలుగోస్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి'ని వెనక్కినెట్టి 32.77 కోట్ల రూపాయలతో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు' నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.

Recommended Video

Sarileru Neekevvaru Public Talk | Mahesh Babu | Rashmika Mandanna | Anil Ravipudi
సరిలేరు నీకెవ్వరు మూవీ

సరిలేరు నీకెవ్వరు మూవీ

సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక నటించగా, విజయశాంతి కీలకపాత్ర పోషించింది. ఈ విజయం పట్ల యూనిట్ అంతా ఆనందం వ్యక్తం చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X