ఎన్ని అపజయాలు వచ్చినా తట్టుకున్న రమేష్ బాబు.. ఆ సమయంలో మహేష్ అండగా...
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన ఘటన అందరినీ ఎంతగానో కలిచివేసింది.. ఎంతో క్రమశిక్షణతో తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గా ఉండే రమేష్ బాబు గారు హఠాత్తుగా మరణించారు అనగానే ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా షాక్ అయ్యారు. అయితే రమేష్ బాబు, మహేష్ బాబు కి మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో తన అన్నయ్యకు సహాయపడే విధంగా మహేష్ సినిమాలు కూడా చేశారు.

బాలనాటుడిగా
1974 లో అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారా బాలనటుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టిన రమేష్ బాబు ఆ తర్వాత తండ్రితో కలిసి కొన్ని సినిమాలు చేశాడు. అంతేకాకుండా కృష్ణ మహేష్ బాబు లతో కలిసి 1988లో కూడా ముగ్గురు కొడుకులు అనే సినిమాలో నటించారు. ఆ సినిమాకు అప్పట్లో మంచి క్రేజ్ కూడా వచ్చింది.

మహేష్ తో అనుబంధం
రమేష్ బాబు మహేష్ బాబుకు ఉన్న అనుబంధం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎమోషనల్ బాండింగ్ తో కొనసాగుతున్నారట. బయటికి వీరి అనుబంధం కనిపించక పోయినప్పటికీ.. కుటుంబంలో మాత్రం రమేష్ బాబు మహేష్ బాబు ఇద్దరు మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా పరిష్కరించుకునే విధంగా చర్చలు కూడా జరుపుకుంటారట.

హీరోగా చేసిన అనంతరం
రమేష్ బాబు హీరోగా చేసిన అనంతరం నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హీరోగా అపజయాలు ఎదురైనప్పటికి ఆయన ఏ మాత్రం నిరాశ చెందకుండా నిర్మాతగా కూడా తన ప్రయత్నాలను కొనసాగించారు. మొదట 1999లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా హిందీలో సూర్యవంశం సినిమా ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఆ సినిమాకు ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు.

నిర్మాతగా..
నిర్మాతగా కూడా రమేష్ బాబు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. ఒక్కడు సినిమా తర్వాత తన స్టార్ ఇమేజ్ ను ఒక్కసారిగా పెంచుకున్న మహేష్ బాబు ఎలాగైనా తన అన్నయ్యకు నిర్మాతగా నిలబెట్టాలని గుణశేఖర్ దర్శకత్వంలో ఒక్కడు అనే సినిమా చేశారు 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంతగా లాభాలని అందుకోలేకపోయింది.

ఆ సినిమాతో నష్టాలు
ఇక తర్వాత మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తీసుకున్న రమేష్ బాబు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు తో అతిథి అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా అయితే ఆయనకు ఊహించని విధంగా నష్టాలను మిగిల్చింది. ఆ విషయంలో మహేష్ బాబు కూడా చాలా బాధపడ్డాడట. అందుకే సరైన సక్సెస్ ని చూడాలి అని చాలా రోజుల్లో మంచి కథల కోసం చర్చలు జరిపారు.

దూకుడుతో బిగ్ హిట్
2011లో దూకుడు సినిమాతో మహేష్ బాబు తన సోదరుడికి నిర్మాతగా మంచి విజయాన్ని అందించాడు. ఆ సినిమాను 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు రమేష్ బాబు కూడా సంయుక్తంగా నిర్మించారు. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

చివరి సినిమా..
1997లో చివరిసారిగా ఎన్ కౌంటర్ సినిమాలో నటించిన రమేష్ బాబు మళ్ళీ కెమెరా వైపు చూడలేదు. అనంతరం 2014లో ఆగడు సినిమా తర్వాత మళ్లీ అయిన సినిమాలు నిర్మించలేదు. సినిమా చేయాలి అని మధ్యలో మహేష్ బాబు చాలాసార్లు చర్చలు జరిగాయి. కానీ రమేష్ బాబు అప్పటికే సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక ఆయన మరణంతో మహేష్ బాబు కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.


Click it and Unblock the Notifications











