twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీ సీఎం జగన్‌ ఫుట్టినరోజు: శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు

    |

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోమవారం పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటోండగా, నాయకులు పలు సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. అదే సమయంలో ఆయనకు దేశ ప్రధాని సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినీ పరిశ్రమ నుంచి కూడా ఏపీ సీఎంకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు నటులు ఆయనకు విసెష్ చెప్పగా.. ఇప్పుడా జాబితాలోకి మహేశ్ బాబు చేరాడు.

    డిసెంబర్ 21 సోమవారంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 48వ పడిలోకి అడుగు పెట్టారు. దీనిని పురస్కరించుకుని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ విజన్, హార్డ్ వర్క్‌తో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని భావిస్తున్నా. ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నా' అంటూ ఆయన రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్‌కు విపరీతమైన స్పందన వస్తోంది.

    Mahesh Babu Birthday Wishes to Y. S. Jaganmohan Reddy

    ఇదిలా ఉండగా, కరోనా కారణంగా నష్టాలను ఎదుర్కొంటోన్న సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఇండస్ట్రీ కోసం రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించారు సీఎం జగన్. ఇందులో భాగంగా 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేసిన ప్రభుత్వం.. దీని ద్వారా నెలకు రూ.3 కోట్ల భారం మోయనుంది. ఈ నిర్ణయం వల్ల 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది. అంతేకాదు, యాజమాన్యాలకు వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు కూడా ప్రకటించింది. దీంతో జగన్‌కు చిరంజీవి సహా పలువురు నటులు ధన్యవాదాలు తెలియజేశారు.

    English summary
    Yeduguri Sandinti Jaganmohan Reddy, is an Indian politician serving as the 17th and current Chief Minister of Andhra Pradesh. He is the founder and president of YSRCP. He was Leader of opposition in the Andhra Pradesh Legislative Assembly from 19 June 2014 until 29 May 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X