»   » మహేష్ బాబు ల్యాండ్ కొన్నారు, ఎక్కడంటే..?

మహేష్ బాబు ల్యాండ్ కొన్నారు, ఎక్కడంటే..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భూమిపై పెట్టబడి ఎప్పటికైనా లాభదాయకమే అనేది పెద్దలు చెప్పే మాట. అందుకే సినీ సెలబ్రిటీల్లో చాలా మంది ఈ దిశగా పెట్టుబడి పెడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ భూములు కొనుగోలు చేసి ఫాం హౌస్ లు ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ఈ లిస్టులో మహేష్ బాబు కూడా చేరారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లోని ఓసియన్ పార్క్ సమీపంలో మహేష్ బాబు 3 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన భారీగానే వెచ్చించినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు అక్కడ ల్యాండ్ కొన్న తర్వాత గండిపేట్ పరిసర ప్రాంతాల్లో భూముల డిమాండ్ పెరిగిందట. దీంతో ఆ ఏరియాలోని వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Mahesh Babu bought land near Gandipet

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ నెలల విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రం తర్వాత తమిళ దర్శకుడు మురుగదాస్ తో సినిమా చేయబోతున్నారు మహేష్. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కానప్పటికీ షూటింగ్ షెడ్యూల్ రెడీ చేసినట్లు సమాచారం. ఆ షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తయితే దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది.

ఇక ఈ ప్రాజెక్టుకు 80 కోట్లు ఖర్చుపెడుతున్నారట. ఇది మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం. విజువల్ గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో ప్రయారిటీ లేదు కానీ భారీగా, రిచ్ గా ఉండాలని మురుగదాస్ నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.

English summary
Latest buzz in T-town is that Mahesh bought 3 acres of land near the Ocean Park in Gandipet on the outskirts of Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu