Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రమేష్ బాబు భార్య పిల్లల గురించి ఆసక్తికరమైన విషయాలు.. వారి బాధ్యత అతని చేతుల్లోనే..
తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన కృష్ణ తన కుమారులను కూడా చాలా తొందరగానే సినిమాల్లోకి తీసుకువచ్చారు. ఇక పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా అంతగా సక్సెస్ కాలేకపోయారు. ఇక ఆయన సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు నుంచి మీడియా ముందుకు రావడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక రమేష్ బాబు మృతితో ప్రస్తుతం ఆయన పిల్లలకు సంబంధించిన అనేక రకాల అంశాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వారి బాగోగుల గురించి కొంత మంది ప్రముఖులు కూడా అడిగి తెలుసుకుంటున్నారు.

హీరోగా ఫెయిల్ అవ్వడంతో..
రమేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమాలో బాలనటుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ బాబు తో కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఇక హీరోగా రమేష్ బాబు ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆయన కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

నిర్మాతగా.. మహేష్ సపోర్ట్
ఇక రమేష్ బాబు ఆర్థికంగా బాగా లేని సమయంలో మహేష్ బాబు కూడా తన సపోర్ట్ ను అందించాడు. ఒక్కడు సినిమా తరువాత అర్జున్ సినిమాకు రమేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత అతిధి సినిమాను కూడా ఆయన నిర్మించారు కానీ ఆ సినిమా దారుణమైన నష్టాలను మిగిల్చింది. ఇక మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుని దూకుడు సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించి మంచి లాభాలను అందుకున్నారు.

కుటుంబ పెద్దగా..
సూపర్ స్టార్ కృష్ణ - ఇందిరా దేవి ఐదుగురు సంతానంలో రమేష్ బాబు పెద్ద కుమారుడు. ఆయన తరువాత మంజుల, పద్మావతి, మహేష్ బాబు, ప్రియదర్శిని జన్మించారు. కృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో రమేష్ తండ్రి బాధ్యతను తీసుకొని కుటుంబ పెద్దగా తమ్ముడిని, సోదరీమణుల బాగోగులు చూసుకునేవారట.

రమేష్ బాబు ఫ్యామిలీ..
ఇక రమేష్ బాబు మరణించడంతో ప్రస్తుతం వారి పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రతీ ఒక్కరు ఆలోచిస్తున్నారు. రమేష్ బాబు సతీమణి పేరు మృదుల. ఇక వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అమ్మాయి పేరు భారతి, అబ్బాయి పేరు జయకృష్ణ. ఎక్కువగా వీరు కూడా మీడియా ముందు అంతగా కనిపించింది లేదు. కేవలం ఫ్యామిలీ ఈవెంట్స్ లలో అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు.

ఇద్దరు చిన్నవారే..
పిల్లలు ఇద్దరు కూడా చిన్నవారే. ప్రస్తుతం చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య రమేష్ బాబు తన కొడుకు దోతి ఫంక్షన్ లో కనిపించగా అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక పిల్లలు ఇద్దరు కూడా చిన్నవారే కావడంతో వారి గురించి అందరూ ఆలోచిస్తున్నారు.

నమ్రత కూడా..
అయితే మహేష్ బాబు తన అన్నయ్య పిల్లల బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాము అని వదినతో కూడా మహేష్ ప్రత్యేకంగా ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగినట్లు కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. ఇక మహేష్ భార్య నమ్రత కూడా త ఆ తొడి కోడలికి అండగా ఉంటూ ఓదారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమె రమేష్ బాబు అంత్యక్రియల్లో భాగంగా జరగాల్సిన కార్యక్రమాలను నమ్రత దగ్గరుండి చూసుకున్నారు.