Mahesh Babu brother Ramesh Babu no more.. పవన్ కల్యాణ్ భావోద్వేగ సంతాపం.. శింబుతో కలిసి..
నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు ఆకస్మిక మృతితో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. గత కొద్దికాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి శనివారం రాత్రి విషమంగా మారింది. దాంతో ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే 10.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. రమేష్ బాబు భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన నివాసంలో పెడుతారని సన్నిహితులు వెల్లడించారు. ఈ విషాద సమయంలో రమేష్ బాబు వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ గురించి, పవన్ కల్యాన్ సంతాప సందేశం గురించిన వివాదాల్లోకి వెళితే..

కృష్ణ, ఇందిర దంపతులకు..
సూపర్ స్టార్ కృష్ణ, ఇందిర దంపతులకు రమేష్ బాబు 1965 అక్టోబర్ 13వ తేదీన చెన్నైలో జన్మించారు. ఆయననకు భార్య మృదుల, చెల్లెల్లు మంజుల, పద్మావతి, ప్రియదర్శిని, సోదరుడు మహేష్ బాబు ఉన్నారు. చిన్నతనంలోనే నటుడిగా పరిచమైన ఆయన దాదాపు 15 చిత్రాల్లో నటించారు. సుమారు ఐదు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ స్థాపించి అర్జున్, అతిథి చిత్రాలను నిర్మించారు. దూకడు, ఆగడు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.

దిగ్గజ దర్శకులతో కలిసి రమేష్ బాబు
హిందీలో సన్నీడియోల్, అమృతాసింగ్ జంటగా నటించిన బేతాబ్ సినిమా రీమేక్‌గా రమేష్ బాబు హీరోగా పరిచయం అయ్యారు. తెలుగు సినిమా దిగ్గజ దర్శకులు వీ మధుసూధన్ రావు, దాసరి నారాయణరావు (బ్లాక్ టైగర్, మామా కోడలు), . జంధ్యాల (చిన్ని కృష్ణుడు), కోదండరామిరెడ్డి ఎస్ఎస్ రవిచంద్ర, టీ రాజేందర్ రూపొందించిన చిత్రాల్లో నటించారు. తండ్రి కృష్ణ దర్శకత్వంలో రెండు చిత్రాల్లో (కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు) నటించారు.

శింబుతో కలిసి తమిళ చిత్రం
తెలుగు చిత్రాల్లో నటిస్తూనే తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రముఖ దర్శకుడు, హీరో శింబు తండ్రి టీ రాజేందర్ దర్శకత్వంలో శాంతి ఎంతు శాంతి అనే చిత్రంలో నటించారు. ప్రముఖ హీరోయిన్ రాధా హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఉత్తమ నటనకు గాను.. శింబుకు ఉత్తమ బాలనటుడు అవార్డును అందుకొన్నారు.

వివాదాలకు దూరంగా, సౌమ్యుడిగా
తెలుగు సినీ పరిశ్రమతో సుమారు 40 దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికి.. నటుడిగా,నిర్మాతగా తన మార్కు చూపించుకోలేకపోయాడు. కృష్ణ నటవారసుడిగా పరిచమైనప్పటికీ ఆ లెగసీని కొనసాగించలేకపోయారు. సినీ పరిశ్రమలో వివాదాస్పద రహితుడిగా, క్లీన్ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నారు. సినీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించారు. ఇలాంటి వ్యక్తి మరణించడంపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. కృష్ణ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ సంతాపం..
రమేష్ బాబు మృతితో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా కలత చెందారు. మృతివార్త తెలియగానే తన సంతాప సందేశంలో.. నటుడు, నిర్మాత శ్రీ ఘట్టమనేని రమేష్ బాబు గారు కన్నుమూశారని తెలిసి దిగ్బ్రాంతికి లోనయ్యాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రముఖ నటులు శ్రీ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగించారు.
అనంతరం చిత్ర నిర్మాణంలోకి వచ్చి విజయాలు అందుకొన్నారు. సోదరుడు మహేష్ బాబుతో అర్జున్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ కృష్ణ గారు పుత్రశోకాన్ని దిగమింగుకోవాల్సిన క్లిష్ట సమయం. కృష్ణగారికి, కుటంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. శ్రీ రమేష్ బాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను అని పవన్ కల్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











