మహేష్ బిజినెస్ మ్యాన్ ఆడియో మూడు భాషల్లో...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్లో తాజాగా రూపొందుతున్న సినిమా బిజినెస్ మ్యాన్. పోరికి లాంటి రికార్డులను తిరగరాసే సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 11న విడుదలన చేయాలని నిర్ణయించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో కూడా ఈ చిత్నాన్ని విడుదల చేస్తున్నారు. మహేష్ బాబు దూకుడు చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన తమన్ ఈ చిత్రానికి కూడా బాణీలు సమకూర్చుతున్నారు. డిసెంబర్లో ఆడియో వేడుక జరిగే అవకాశం ఉంది. ఆడియో వేడుకను కూడా తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు దర్శక నిర్మాతలు. ఇందుకోసం ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











