చట్ట వ్యతిరేకంగా 'బిజినెస్ మ్యాన్' నిర్మాతలు
సూపర్ హిట్టైన మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ రిలీజైన రోజు నుంచీ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రం పోస్టర్స్ విషయంలో చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ ఓ ఇంగ్లీష్ డైలీ ప్రచురించింది. బిజినెస్ మ్యాన్ టైటిల్ గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)వారు ది బిజినెస్ మ్యాన్ అని ఎప్రూవ్ చేసారని,అయితే నిర్మాతలు దాన్ని గాలికి వదిలేసి కేవలం బిజినెస్ మ్యాన్ అనే పదంతోనే బిజినెస్ చేస్తున్నారని అంటున్నారు. ఇలా సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని అతిక్రమించి తమ ఇష్టం వచ్చినట్లు గాలికి రూల్స్ ని వదిలేస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష,ఫైన్ ఉంటుందని తెలియచేస్తున్నారు. అలాగే అలాగే జనవరి 1,2011న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ది బిజినెస్ మ్యాన్ అనే టైటిల్ తో రిజిస్ట్రేషన్ చేయించారు.
దాన్ని ఏప్రియల్ 22,2012 వరకూ రెన్యువల్ డేట్ ఉంది. ఆ విధంగా పిల్మ్ చాంబర్ లో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి,మరొక టైటిల్ తో విడుదల చేయటం నేరం అంటున్నారు. మరో ప్రక్క చిత్రంకి ఎ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని పోస్టర్స్ వేయటం లేదని చెప్తున్నారు. అంతేకాక సెన్సార్ సర్టిఫికేట్ ని ధియోటర్స్ వద్ద ప్రేక్షకులకు అందుబాటులో ఉంచటం లేదని చెప్తున్నారు. వీటిన్నటికి తోడు ఈ చిత్రంలోని ఓ పాట అభ్యంతరంగా ఉందని వియెచ్ పి ఏక్టివిస్ట్ లు పోలీస్ కంప్లైంట్ చేసారు. ఇవన్నీ చట్టానికి సంభందించిన వ్యతిరేకమైన వ్యవహారాలు కాబట్టి తప్పనిసరిగా నిర్మాతలు ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుందని అంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











