హాట్ న్యూస్:' బిజినెస్ మ్యాన్' రిలీజ్ వాయిదా
మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ ని జనవరి 11న విడుదల ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో లేట్ అవ్వటం వలన రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నారు. మొదట అనుకున్న దానికి రెండు రోజులు ముందుకు జరిపి జనవరి 13న విడుదల చేయనున్నారు. తమిళ వెర్షన్ ని జనవరి 26న విడుదల చేస్తారు. మళయాళ వెర్షన్ విడుదల కు ఇంకా విడుదల తేది ఫిక్స్ కాలేదు. దూకుడు చిత్రం ఓవర్ సీస్ మార్కెట్లో చేసిన బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి భారి ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం ఆడియో మంచి క్రేజ్ సంపాదించుకుని మార్కెట్లో సినిమాపై అంచనాలు పెంచుతోంది.ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్క్రీన్ చేయనున్నారు. ఓవర్ సీస్ లో సెటిలైన తెలుగువారు కాని మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మొట్టమొదటి సబ్ టైటిల్స్ తో వస్తున్న తెలుగు చిత్రం కావటం మరో రికార్డుగా అభివర్ణిస్తున్నారు.
ఇక మహేష్ బాబు దూకుడుతో పెరిగిన మార్కెట్ కు అణుగుణంగానే బిజినెస్ మ్యాన్ ఉండబోతోందని చెప్తున్నారు. అందులోనూ గతంలో మహేష్,పూరీ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి మెగా హిట్ ఫిలిం కావటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఉన్నాయి.కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో కథ నడవనుంది. ఇక మహేష్ కి తెలుగు సహా తమిళ్‌లోనూ భారీ మార్కెట్ ఉంది. ముఖ్యంగా చెన్నైలో లో అతని వీరాభిమానులు ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై డావెంకట్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











