అక్కడ 10నే ‘బిజినెస్‌ మేన్’ రిలీజ్

By Srikanya

10న టొరొంటో, 11న స్కార్‌బరౌగ్, 12న మిస్సిసాగా, 15న ఎడ్‌మన్టన్, లండన్‌లలో మహేష్ తాజా చిత్రం 'ది బిజినెస్‌మేన్'ప్రీమియర్ షోస్ లు జరగనున్నాయని సమాచారం. నిజానికి మొదట ఈ చిత్రాన్ని ముందుగా జనవరి 12న విడుదల చేస్తామని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఒకరోజు ముందే రిలీజ్ చేస్తామని అన్నారు. ఆ ప్రకారం 11న ఈ చిత్రం విడుదల కావల్సి ఉంది. అయితే, ఈ తేదీ కూడా మారింది. ఈ నెల 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. విదేశాల్లో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అక్కడ ప్రీమియర్ షోస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఇక ఈ చిత్రంపై మహేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఆ మధ్య ''ఒక్క వ్యక్తి (పూరి జగన్నాథ్) మాత్రమే ఇలాంటి సినిమా చేయగలరు. నా కెరీర్‌కి మరో మైలురాయిలాంటి సినిమా ఇస్తున్నందుకు థ్యాంక్స్ జగన్‌గారు'' అని కూడా మహేష్ ట్వీట్ చేశారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల సందర్భంగా ట్వీట్ చేస్తూ...''నేను చేసిన చిత్రాల్లన్నిటిలోకల్లా నా 'బెస్ట్ లుక్' ఇదే. ఇప్పటివరకు నేను చెయ్యని పాత్రను ఇందులో చేశాను. ఇంకా చెప్పాలంటే ఇందులోని పాత్ర నాకు సవాల్‌లాంటిది. అయితే జగన్‌గారి క్లారిటీ వల్ల ఈజీగా అనిపించింది. నా కెరీర్‌లో సెన్సేషనల్ హిట్ సాధించబోయే సినిమా అవుతుంది'' అని ట్వీట్ చేసారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మహేష్‌బాబు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X