twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీ షర్ట్స్ తోనూ మహేష్ బాబు బిజినెస్

    By Srikanya
    |

    మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ ప్రమోషన్ లో భాగంగా టీ షర్ట్ లపై ఈ చిత్రం ఫొటోలను ముద్రించారు. ఈ షర్ట్ లు మహేష్ ఫ్యాన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బిజినెస్ స్ట్రాటజీ పాతదే అయినా బాగానే క్లిక్ అయ్యిందంటున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం రిలీజ్ రోజు మహేష్ ఫ్యాన్స్ ఈ టీ షర్ట్ లు వేసుకుని ధియోటర్స్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాంతో ఈ టీ షర్ట్ లు బాగానే అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ని జనవరి 11న విడుదల ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో లేట్ అవ్వటం వలన రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నారు.

    మొదట అనుకున్న దానికి రెండు రోజులు ముందుకు జరిపి జనవరి 13న విడుదల చేయనున్నారు. తమిళ వెర్షన్ ని జనవరి 26న విడుదల చేస్తారు. మళయాళ వెర్షన్ విడుదల కు ఇంకా విడుదల తేది ఫిక్స్ కాలేదు. దూకుడు చిత్రం ఓవర్ సీస్ మార్కెట్లో చేసిన బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి భారి ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో మంచి క్రేజ్ సంపాదించుకుని మార్కెట్లో సినిమాపై అంచనాలు పెంచుతోంది.ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్క్రీన్ చేయనున్నారు. ఓవర్ సీస్ లో సెటిలైన తెలుగువారు కాని మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మొట్టమొదటి సబ్ టైటిల్స్ తో వస్తున్న తెలుగు చిత్రం కావటం మరో రికార్డుగా అభివర్ణిస్తున్నారు.

    English summary
    Mahesh Babu's Business Man T shirts are creating craze in th market.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X