'దూకుడు' తో స్టాటజీ మార్చిన మహేష్
మహేష్ బాబు కెరీర్ ఇప్పుడు దూకుడుకు ముందు,తర్వాత అన్నట్లు విభజిస్తున్నారు సినీ విశ్లేషకులు.దూకుడుతో పాపులారిటీ ఎక్కడికో వెళ్లిపోవటంతో మహేష్ అంతకుముందు ప్లాప్ లను అధిగమించినట్లైంది.పోకిరి తర్వాత దూకుడు మాత్రమే ఆ రే్ంజి హిట్టుని అందుకుని ఆయన క్రేజ్ తగ్గలేదని నిరూపించింది. దాంతో ఇప్పుడు మహేష్ చేస్తున్న సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపువచ్చింది.ఇప్పుడు మహేష్ చేతిలో ..ది బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సుకుమార్ చిత్రం,క్రిష్-అశ్వనీదత్ చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ వేటికవే విభిన్నమైన చిత్రాలుగా మహేష్ భావించి చేస్తున్నాడంటున్నారు.ది బిజినెస్ మ్యాన్ చిత్రం మాఫియా నేపధ్యంలో కథ జరిగితే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోంది.సుకుమార్ చిత్రం యువతను టార్గెట్ చేస్తూ సాగుతుందని,క్రిష్ చిత్రం ఓ ప్రయోగంగా రూపొంది మహేష్ కెరీర్ ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నాడు.
ఇక బిజెనెస్ మ్యాన్ విషయానికి వస్తే... ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు పూరీ .గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ ని కూడా పూరి రెడీ చేస్తున్నారు.హిందీ వెర్షన్ లో అబిషేక్ బచ్చన్ చేయనున్నారు.ఈ విషయమై పూరీ మాట్లాడుతూ...తెలుగు, హిందీ వెర్షన్స్ రెండూ ఒకేలా ఎందుకుంటాయి. ఒకటి ప్రత్యేకంగా మహేష్ కోసం తెలుగు ఆడియన్స్ ఇష్టపడేలా డిజైన్ చేసింది. మరొకటి అభిషేక్ బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చేలా చేసిన స్క్రిప్టు. అలాగే నేను తెలుగు వెర్షన్ కి రీమేక్ లాగ దీన్ని తీర్చిదిద్దదలుచుకోలేదు. అయితే రెండు చిత్రాలకు నేపధ్యం మాత్రం ముంబై మాత్రమే. అక్కడే కథ జరుగుతుంది. కథలో మార్పులు మాత్రం ఉంటాయి. అలాగే హీరోయిన్ గా కాజల్ ని కూడా తెలుగుకే పరిమితం చేసి హిందీకి వేరే ఫ్రెష్ ఫేస్ ని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











