అనిల్ రావిపూడి, మహేష్ సినిమా.. కీలక సమాచారం లీక్
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ చిత్రానికి సరిలేవు నీకెవ్వరూ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. సినిమాలో మహేష్ పేరు అజయ్ జోసెఫ్ అని ప్రచారం అవుతున్నది. ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తి పాత్రను పోషిస్తున్నారట. మహేష్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా ఈ పాత్రను డిజైన్ చేసినట్టు తెలిసింది.
F2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఘన విజయం తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న చిత్రమిది. భారీ విజయం తర్వాత అనిల్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ కెరీర్‌లో ఆయనకు ఐదోవది. నంబర్ 5 లోడింగ్ అంటూ తాజాగా అనిల్ ట్వీట్ చేశారు.

ఈ చిత్రం కోసం ఇప్పటికే స్టార్ నటీనటులను ఎంపిక చేసినట్టు సమాచారం. రమ్యకృష్ణ, విజయ్ శాంతి, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రం రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నట్టు తెలిసిందే.


Click it and Unblock the Notifications











