ఛత్రపతి శివాజిగా మహేష్ బాబు
ఛత్రపతి శివాజిగా మహేష్ బాబు త్వరలో కనిపించనున్నారా అంటే అది జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు తన కంటిన్యూ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక ఈ విషయాన్ని గుణశేఖర్ రీసెంట్ గా ఓ తెలుగు సినిమా వీక్లీతో చెప్పటం జరిగింది.అ యితే మహేష్ బాబు ఈ ప్రాజెక్టుని ఓకే చేసారా లేదా అనేది మాత్రం తెలియరాలేదు. గుణశేఖర్ మాత్రం ఈ ప్రాజెక్టుని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తీయాలని భావిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో గతంలో మహేష్ బాబు...ఒక్కడు, సైనికుడు, అర్జున్ చిత్రాలు రూపొందించారు. ఒక్కడు చిత్రం మహేష్ కెరీర్ లోనే నెంబర్ వన్ గా మిగిలింది.ఇక గుణశేఖర్ ప్రస్తుతం నిప్పు చిత్రం బిజీలో ఉన్నారు. రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైవియస్ చౌదరి తన బొమ్మరిల్లు బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక మహేష్ బాబు తాజా చిత్రం ది బిజెనెస్ మ్యాన్ విషయానికి వస్తే.. మహేష్ కెరీర్ లోనే ఎన్నూ లేనంత స్పీడు గా ఈ సినిమా షూటింగ్ జరుపుకోవటం విశేషం. ఇక బిజినెస్ మెన్ కోసం థమన్ ఓ పక్క సాంగ్స్ రీకార్దింగ్ జరుగుతూంటే మరో పక్క వాటి షూటింగ్ కూడా జరిగిపోతుంది. ఇప్పటికి థమన్ మూడు పాటలు రికార్డ్ చేసినట్లు చెప్పుతున్నారు.
ఇక ది బిజెనెస్ మ్యాన్ విషయానికి వస్తే...ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











