ఆడియో ఫంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ గా మహేష్

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబు ఛీప్ గెస్ట్ గా మరో ఆడియో పంక్షన్ కి హాజరుకానున్నారు. అయితే అది తెలుగు చిత్రం కోసం కాదు. కన్నడ దూకుడు రీమేక్ అయిన పవర్ చిత్రం ఆడియో పంక్షన్ కి ఆయన బెంగుళూరు వెళ్తున్నారు. మహేష్ కు కన్నడంలో నూ అభిమానులు ఉండటంతో ఖచ్చితంగా ఆ ఆడియో పంక్షన్ సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాతలు 14 రీల్స్ వారు కావటం, చిత్రం హీరో పునీత్ రాజ్ కుమార్ కి మహేష్ తో మంచి స్నేహం ఉండటంతో మహేష్ ఈ పంక్షన్ కి వెళ్తున్నాడు. 28న ఈ ఆడియో పంక్షన్ జరగనుంది.

మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం దూకుడు. ఆ చిత్రం లో విజువల్స్ ని మహేష్ స్టైల్స్ ని ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు దూకుడు ని యాజటీజ్ దింపేస్తూ..మహేష్ మ్యానరిజంస్ తో సహా 'పవర్' ఫస్ట్ లుక్ టీజర్ దూకింది. అయితే ఈ చిత్రం మహేష్...దూకుడు కి రీమేక్. 14 రీల్స్ వారే కన్నడంలోనూ నిర్మిస్తున్నారు. మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మహేష్ ని అనుకరిస్తూ పునీత్ రాజ్ కుమార్, త్రిష నటించారు.

Mahesh Babu chief guest to 'Power'audio

మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన తెలుగు చిత్రం 'దూకుడు' అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు అమితంగా ఆకట్టుకున్న సినిమాగా ఈ చిత్రం పేరు తెచ్చకుంది. ఈ చిత్రం త్వరలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా రీమేక్ చేయనున్నారు.

ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషల్లో నటించిన త్రిష పలు విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తొలిసారి ఆమె కన్నడలో 'దూకుడు' చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాకు త్రిష భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కన్నడ చిత్రసీమలో చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X