మహేష్ బాబు షూటింగ్ పై కూడా దాడి
సినిమా షూటింగ్‌లపై జరుగుతున్న దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. మూడురోజుల కిందట మనోజ్, నిన్న అల్లు అర్జున్‌ల చిత్ర యూనిట్‌లపై దాడి జరుగగా, తాజాగా మహేష్ బాబుపై షూటింగ్ జరుగుతున్న చిత్ర యూనిట్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో చిత్రీకరణ జరుగుతుండగా, షూటింగ్‌ను అడ్డుకుని కెమెరా, సామగ్రి ధ్వంసం చేశారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ చిత్రం రెడీ అవుతోంది. శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన అనూష్క చేస్తోంది. ఇంతకుముందు మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మహేష్ బాబు అల్లు అర్జున్ మనోజ్ అనూష్క శింగనమల రమేష్ పులి వికారాబాద్ త్రివిక్రమ్ శ్రీనివాస్ mahesh babu allu arjun manoj anushka singanamala ramesh vikarabad


Click it and Unblock the Notifications