ప్రెస్‌మీట్‌లో మహేశ్ అసహనం: నేను టూర్లు వెళ్తే మీకేంటి.. గుంటూరు కారం రిలీజ్ అప్పుడే అంటూ!
ప్రస్తుతం ఉన్న పోటీలో సినీ రంగంలో స్టార్‌గా హవాను చూపించాలంటే చాలా కష్టం అనే చెప్పాలి. కానీ, కొందరు మాత్రం టాలీవుడ్‌లో తమ రేంజ్‌ను పెంచుకుంటూనే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సూపర్ స్టార్ మహేశ్ బాబుదే. అంతలా ఈ బడా హీరో కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు. తద్వారా తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మహేశ్ బాబు 'గుంటూరు కారం' రిలీజ్ డేట్‌తో పాటు ఓ విషయంపై స్పందించాడు. ఆ వివరాలు మీకోసం!
గుంటూరు కారం అంటున్నాడు: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తోన్న చిత్రమే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలు పోషిస్తున్నారు.

షూటింగ్ బ్రేక్‌లతో ఇబ్బందులే: పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'గుంటూరు కారం' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని బ్రేకులు రావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పున: ప్రారంభం అయిందన్న విషయం తెలిసిందే.
ఫారెన్ ట్రిప్‌లు.. విమర్శలతో: సినిమాల్లో సూపర్ స్టార్ అయిన మహేశ్ బాబు ఖాళీ సమయాన్ని తన కుటుంబంతోనే గడుపుతూ ఉంటాడు. ముఖ్యంగా అతడు షూటింగ్ గ్యాప్ వస్తే తరచూ ఫారెన్ ట్రిప్‌లకు వెళ్తుంటాడు. ఇక, 'గుంటూరు కారం' సినిమా ప్రారంభం అయిన తర్వాత మహేశ్ చాలా సార్లు టూర్లకు వెళ్లాడు. దీంతో అతడిపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. కానీ, ఈ స్టార్ హీరో మాత్రం తగ్గడం లేదు.

ఈవెంట్‌లో.. ఎన్నో అంశాలు:సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ సంస్థ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఇందులో సదరు బ్రాండ్ రిలేటెడ్ క్వశ్చన్స్‌తో పాటు సినిమా, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడాడు.
గుంటూరు కారం రిలీజ్‌పైన: ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న సూపర్ స్టార్ మహేశ్ బాబును 'గుంటూరు కారం' రిలీజ్ గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికతడు 'ఇది ప్రైవేట్ ఈవెంట్. దీనికి సంబంధించిన ప్రశ్నలే అడగండి' అన్న మహేశ్ బాబు ఆ తర్వాత 'గుంటూరు కారం సంక్రాంతికి రాబోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి' అంటూ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు.

ఫారెన్ ట్రిప్‌లపై షాకింగ్‌గా: ఇదే ఈవెంట్‌లో 'మీరు తరచూ ఫారెన్ ట్రిప్‌లకు వెళ్తుంటారు. దీనిపై వచ్చే విమర్శలు మీ వరకూ వచ్చాయా' అని ఒకరు ప్రశ్నించారు. దీనికి మహేశ్ అసహనం వ్యక్తం చేస్తూ 'అదేంటండి. నా డబ్బులతో నేను ట్రిప్‌లకు వెళ్తే మీకేంటి? మా పిల్లలకు హాలీడేస్ వచ్చినప్పుడో.. నాకు షూటింగ్ గ్యాప్స్‌లో ట్రిప్‌లకు వెళ్తుంటాను. నాకు ఫ్యామిలీతో గడపడం ఇష్టం' అంటూ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











