శంకర్ ప్రాజెక్ట్: రూమర్లకు తెరదించిన మహేష్ బాబు
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శంకర్ ఇటీవల ‘ఆగడు' ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. శంకర్ రాకతో....మహేష్ బాబు-శంకర్ కాంబినేషన్లో సినిమా రాబోతోందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై మహేష్ బాబు స్పందించారు. శంకర్‍తో తాను ఎలాంటి సినిమా చేయడం లేదని స్పష్టం చేసారు. ‘ఆగడు' తమన్ చేస్తున్న 50వ సినిమా కావడంతో ఆయన్ను విష్ చేసేందుకు వచ్చారని తెలిపారు.

‘ఆగడు' సినిమా విషయానికొస్తే...ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈ నెలలోనే విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఆగడు టైటిల్ సాంగ్, నారి నారి, జంక్షన్లో..., తూ ఆజా సరోజా పాటలు శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సంవత్సరం థమన్ చేసిన ఆడియోల్లో ‘ఆగడు' ది బెస్ట్ ఆడియోగా అందరి ప్రశంసలు అందుకుంటోందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. సేల్స్ పరంగా ఈ ఆడియో కొత్త రికార్డులు సృష్టిస్తోందని అన్ని ఏరియాల నుండి రిపోర్ట్ష్ వస్తున్నాయి. అలాగే డిజిటల్ కూడా చాలా హై రేంజిలో డౌన్ లోడ్స్ జరుగుతున్నాయని తెలిపారు. లహరి మ్యూజిక్ అధినేత మనోహర్ నాయుడు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











