మహేష్ బాబు చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చాడు. గత 16 నెలలుగా సినిమా షూటింగ్ లకు దూరంగా ఉన్న ఈ రాకుమారుడు నిన్న సినిమా సెట్ మీదికి వచ్చాడు. మహేష్ బాబు, అనుష్కల తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో వీరిద్దరి బెడ్ రూమ్ సీన్ ను చిత్రీకరించారు. మరో ఇరవై రోజుల పాటు ఉండే ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు రెగ్యులర్ గా పాల్గొంటారు. ఆ తరువాత షూటింగ్ నాసిక్ లో, కేరళలో జరుగుతుంది. మణిశర్మ సంగీతం సమకూర్చే ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్. నిర్మాత సింగనమల రమేష్. కెమెరా సునీల్ పటేల్.