twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తారక్ కొత్త ట్రెండ్, ఇది అడ్వాంటేజ్... మా బిజినెస్ పెరుగుతుంది: మహేష్ బాబు

    By Bojja Kumar
    |

    'భరత్ అనే నేను' సినిమా పెద్ద హిట్టవ్వడం, రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడంపై మహేష్ బాబు హ్యాపీగా ఉన్నారు. తాజాగా ఆయన టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా విడుదల తర్వాత పెద్ద ప్రెజర్ రిలీవ్ అయిందని, రెండు సంవత్సరాలుగా ప్రెజర్ ఫీలవుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద హిట్టివ్వాలి అని ఉండేది. భరత్ అనే నేను సినిమా ఫలితం సంతోషాన్ని ఇచ్చింది. ఇందుకు శివ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఆయన భరత్ క్యారెక్టర్ అంత బాగా డిజైన్ చేయడం, ప్రేక్షకులు నచ్చేలా స్క్రిప్టు రాసుకోవడం వల్లనే సినిమా ఇంత బాగా వచ్చింది అని మహేష్ బాబు తెలిపారు. నా కెరీర్లోనే ఇది బెస్ట్ సినిమా అని మహేష్ బాబు తెలిపారు.

    సీఎం పాత్ర అంటే జోక్ కాదు

    సీఎం పాత్ర అంటే జోక్ కాదు

    సీఎం పాత్ర చేయడం అంటే జోక్ కాదు. ఇదొక జెన్యూన్ పొలిటికల్ థ్రిల్లర్. దాన్ని క్యారీ చేయడం అంటే బిగ్ రెస్పాన్సిబిలిటీ. సాధారణంగా హ్యూమన్ సైకాలజీ ప్రకారం కష్టమైన పని అయినపుడు దాన్ని ఎవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ శివ స్క్రిప్టు చెప్పగానే ఐ వాజ్ బ్లోన్ అవే... ఇలాంటి సినిమా నాకు వచ్చినందుకు గర్వంగా అనిపిచింది.... అని మహేష్ బాబు తెలిపారు.

    పది పదిహేనేళ్ల తర్వాత కూడా ఇలాంటి సినిమాలు గుర్తుంటాయి

    పది పదిహేనేళ్ల తర్వాత కూడా ఇలాంటి సినిమాలు గుర్తుంటాయి

    ఇది ఒక లైబ్రరీ లాంటి సినిమా. పది పదిహేనేళ్ల తర్వాత కూడా ఇలాంటి సినిమాలు గుర్తుంటాయి. శివగారు కథను నమ్ముతారు. బ్రిలియంట్ స్టోరీ టెల్లర్. ఎప్పుడూ కథ నుండి డివియేట్ అవ్వరు. అతడి సినిమా అంతా ఒక బుక్ లాగ ఉంటుంది. ప్రతీది నీట్ గా ఉంటుంది.... అని మహేష్ బాబు తెలిపారు.

    ప్రయోగాలు చేస్తే నచ్చదు

    ప్రయోగాలు చేస్తే నచ్చదు

    సుకుమార్‌గారితో నెక్స్ట్ మూవీ ఖరారు చేసిన మాట నిజమే. ప్రయోగాల జోలికి వెళితే మా నాన్నగారి ఫ్యాన్స్ వచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తారు అని గతంలో అన్నమాట నిజమే. సుకుమార్‌తో మళ్లీ ప్రయోగం చేయడం లేదు. ఈ సారి చేయబోయేది టోటల్ కమర్షియల్ ఫిల్మ్. సుకుమార్ గారి ‘రంగస్థలం' సినిమా చూశాను, ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ పెద్ద ప్లస్సయింది. భరత్ అనే నేను పొలిటికల్ బ్యాక్ డ్రాప్. జెన్యూన్ పొలిటికల్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ప్రేక్షకులు టోటల్ కొత్తగా చేసినా చూడరు. వారికి కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి, అదే సమయంలో రోటీన్ గా కాకుండా ఏదో కొత్తగా ఉండాలి, అలా అయితనే వర్కౌట్ అవుతాయి అని మహేష్ బాబు తెలిపారు.

    25వ సినిమా వంశీ పైడిపల్లితో, రెండు సంవత్సరాలు ఆగాడు

    25వ సినిమా వంశీ పైడిపల్లితో, రెండు సంవత్సరాలు ఆగాడు

    25వ సినిమా వంశీపైడి పల్లితో చేయబోతున్నాను. జూన్ నుండి సినిమా మొదలవుతుంది. ఈ సినిమాపై చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. అంత మంచి స్క్రిప్టు పెట్టుకుని నా కోసం రెండేళ్లు వెయిట్ చేశాడు. అందుకు అతడికి థాంక్స్ చెప్పాలి.... అని మహేష్ బాబు తెలిపారు.

    తారక్ ట్రెండ్ క్రియేట్ చేశాడు

    తారక్ ట్రెండ్ క్రియేట్ చేశాడు

    చాలా రోజులైంది ఒక పెద్ద హీరో ఇంకో పెద్ద హీరో ఫంక్షన్‌కు వచ్చి. అందుకే ఈ సారి కొత్తగా అలా చేశాం. తప్పకుండా నన్ను కూడా భవిష్యత్తులో మరో హీరో ఫంక్షన్లో చూస్తారు. తారక్ మా సినిమా ఫంక్షన్‌కు రావడం ద్వారా కొత్త ట్రెండ్ సెట్ చేశాడు.... అని మహేష్ బాబు తెలిపారు.

    మా బిజినెస్ లు పెరుగుతాయి, మా రేంజిలు పెరుగుతాయి

    మా బిజినెస్ లు పెరుగుతాయి, మా రేంజిలు పెరుగుతాయి

    హీరోస్ అందరూ బావుంటారు. తారక్ సినిమా హిట్టయినపుడు నేను ఫోన్ చేసి అభినందిస్తాను, చరణ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఇక్కడ చాలా హెల్దీ ఎట్మాస్పియర్ ఉంది. ఇలా రావడం వల్ల ట్రెండ్ మారిపోతోంది. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు అందరూ వెళతారు, యూనిటీ ఉంటుంది. ఏ పెద్ద హీరో సినిమా బ్లాక్ బస్టర్ అయినా ఇంకో హీరోకు కూడా అడ్వాంటేజే. ఎందుకంటే మా బిజినెస్ లు పెరుగుతాయి, మా రేంజిలు పెరుగుతాయి, ఇండస్ట్రీ ఇంకా చాలా బావుంటుంది.... అని మహేష్ బాబు తెలిపారు.

    English summary
    Tollywood Super Star Mahesh Babu interesting Comments About His Relation With JrNTR and Ram charan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X