దున్నేస్తుంది! అనే రేంజ్‌లో మహేష్ బాబు ట్వీటుడు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా బిజినెస్ మేన్ జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మహేష్ బాబు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. సినిమా ఈ సారి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంలా కనిపిస్తోంది ఆయన తన ట్విట్టర్లో రాసిన వ్యాఖ్యలు చూస్తుంటే. బిజినెస్ మేన్ సినిమా ఈ సారి బాక్సాఫీసును దున్నేస్తుందనే రేంజ్ లో మహేష్ బాబు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
''నా అభిప్రాయం ప్రకారం ఈ సినిమా సూపర్ రిలీజ్, అంతా కలిసి త్వరలోనే పండగ చేసుకుంటాం, జగన్ గారికి స్పెషల్ థాంక్స్, ఆయన తీసిని సినిమాల్లోనే ఈ సినిమా టాప్ పొజిషన్ కు వెలుతుంది, ఆయన సినిమా ఇరగదీశాడు' అంటూ మహేష్ బాబు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు-కాజల్ జంటగా నటించారు. ఇందులో ఈ ఇద్దరి మధ్య ఘాటైన ముద్దు సీన్ కూడా ప్లాన్ చేశారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. జనవరి 13న వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా చరిత్రలోనే రికార్డు స్థాయిలో 2000 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











