»   »  భలే ఫీలయ్యాడులే: తనయుడిపై మహేష్ బాబు

భలే ఫీలయ్యాడులే: తనయుడిపై మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: '1 నేనొక్కడినే' సినిమా ఆడియో ప్రారంభ కార్యక్రమంలో ప్రిన్స్ మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్‌పై మురిసిపోతూ కామెంట్లు చేశాడు. ఈ సినిమా ద్వారా తన అబ్బాయి గౌతం నటుడిగా పరిచయమవుతున్నాడని, ఇది తనకెంతో ఆనందంగా ఉందని మహేష్ బాబు అంటూ "నా కన్నా తానే బాగా చేశానని వాడి ఫీలింగ్" అని వ్యాఖ్యానించాడు. ఏది ఏమైనా ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిదని ఆయన అన్నాడు.

 Mahesh babu comments on his son

మొత్తంగా ఇది తన కెరీర్‌లో బెస్ట్ మూవీ అని అన్నాడు. పీటర్ హేన్స్ ఈ సినిమాలో తనతో పెద్ద పెద్ద సాహసాలే చేయించాడని, భవనాల మీంచి దూకించేశారని ఆయన అన్నారు. తాను డ్యాన్సులు చేయడం లేదని అబిమానుల్లో ఓ బాధ ఉందని, ఆ బాధను ఈ సినిమా తీర్చేస్తుందని మహేష్ బాబు అన్నాడు.

దేవిశ్రీతో తన అయిదో సినిమా ఇది అని, తన గత చిత్రాల్లాగే ఈ సినిమాకు కూడా మంచి సంగీతం ఇచ్చాడని, ఈ సినిమాకు ఈ లుక్, ఈ కలర్ రావడానికి కారణం రత్నవేలు అని ఆయన అన్నారు. సాంకేతికంగా ఈ సినిమా నిజంగా వండర్ అనే చెప్పాలని సుకుమార్ అన్నాడు.

నిజంగా తాను లక్కీ అని, ఫ్యూచర్ స్టార్‌ని పరిచయం చేసిన అదృష్టం తనకు దక్కిందని, సింగిల్ టేక్ అర్టీస్ట్ గౌతం అని సుకుమార్ అన్నారు.

English summary

 Prince Mahesh babu made comment on his son Goutham's feeling.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu