మీ జర్నీ నిజంగా చాలా స్ఫూర్తివంతం.. సీనియర్ హీరోపై మహేష్ బాబు కామెంట్స్
నేడు సీనియర్ హీరో కమల్ హాసన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు. ఈ నేపథ్యంలోనే ఆయనకు టాలీవుడ్ నటుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు. ఈ మేరకు కమల్ హాసన్ సినీరంగానికి అందించిన సహకారం అసాధారణం, అద్వితీయం అని కొనియాడారు మహేష్.
'కమల్ హాసన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ రంగానికి మీరందించిన సహకారం అసాధారణం, అద్వితీయం. అలాగే, సినీ రంగంలో 60 ఏళ్లు పూర్తి చేసుకుంటోన్న మీకు శుభాకాంక్షలు.. మీ జర్నీ నిజంగా చాలా స్ఫూర్తివంతం. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని పేర్కంటూ మహేష్ బాబు ట్వీట్ పెట్టారు.

ఇక కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే.. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఆయన, ప్రస్తుతం గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇండియన్ 2' సినిమాలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ సహా ఇతర భాషల్లోనూ భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కమల్ జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
మరోవైపు మహేష్ బాబు తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరుతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన క్రేజీ భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











